Election Campaign in Telangana :రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ఖమ్మంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డికి మద్దతుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బీడీ కార్మికులతో సమావేశమయ్యారు. అధికారంలోకి రాగానే బీడి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా గిరిజనులందరూ ఏకతాటిపైకి రావాలని గిరిజన మేధావుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వీరన్ననాయక్ కోరారు.
పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్, రామగిరి మండలాల్లో మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లిలో యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణను ఆశీర్వదించాలని కోరారు. హనుమకొండ జిల్లా ఐనవోలులో వరంగల్ బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్ రోడ్‌షో నిర్వహించారు. తనను ఎంపీగా గెలిపిస్తే మామునూరు విమానాశ్రయం పునరుద్దరణకు కృషి చేస్తానన్నారు. చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సరూర్‌నగర్, ఆర్కేపురం డివిజన్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
BJP MP Candidate Election Campaign :పెద్దపెల్లి జిల్లా మంథని, ముత్తారం మండలాల్లో బీజేపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈసారి పెద్దపెల్లిలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాలలో నిజామాబాద్ కమలం పార్టీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజలను మభ్యపెట్టడానికి రిజర్వేషన్లు రద్దు అనే బూటకానికి తెరలేపాయని మండిపడ్డారు. భువనగిరిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సంతకాల ఫోర్జరీ చేసిన వ్యక్తికి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చిందని మండిపడ్డారు. గల్లీలో లేని బీఆర్ఎస్ను దిల్లీకి పంపినా ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు.
ఎలక్షన్ వార్ - ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల దూకుడు - lok sabha elections 2024