Police Searches at YSRCP Leader Gautam Reddy Home: వైఎస్సార్సీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి నివాసంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విజయవాడకు చెేదిన గండూరి ఉమామహేశ్వర శాస్త్రిపై హత్యాయత్నం కేసులో గౌతంరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసిన నేపథ్యంలో పోలీసులు అయన నివాసంలో తనిఖీలు చేశారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో అరెస్టు చేస్తారని ప్రచారంతో గౌతమ్ రెడ్డి ఇప్పటికే పరారీలో ఉన్నారు.
తమ భూమిని కబ్జా చేసి భవనాన్ని నిర్మించారని గండూరి ఉమామహేశ్వర శాస్త్రి గతంలో గౌతమ్ రెడ్డిపై కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో గౌతమ్ రెడ్డి కొంతమందికి సుపారీ ఇచ్చి ఉమామహేశ్వర శాస్త్రిపై హత్యాయత్నం చేశారని ఆరోపిస్తూ విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పలుమార్లు పోలీసులు గౌతమ్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవగా ఆయన కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది.