ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

'చిన్న విషయాన్ని పెద్దగా చూస్తున్నారు - ఫోన్​ ట్యాపింగ్​తో నాకేమీ సంబంధం లేదు' - EX BRS MLA ON PHONE TAPPING CASE

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మాజీ ఎమ్మెల్యే లింగయ్యతో ముగిసిన విచారణ - ప్రచార సమయంలో అదనపు ఎస్పీ (సస్పెండెడ్‌) తిరుపతన్నతో మాట్లాడిన మాట వాస్తవమే అన్న లింగయ్య

Telangana Police investigation to Ex BRS MLA on Phone Tapping case
Telangana Police investigation to Ex BRS MLA on Phone Tapping case (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 14, 2024, 7:07 PM IST

Telangana Police investigation to Ex BRS MLA on Phone Tapping case :తెలంగాణలో వెలుగుచూసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ లింకులను బయటపెట్టేందుకు పోలీసుల దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్ఎస్​ నేత, నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు తెలిపారు. ఈనెల 9న తనకు నోటీసులు ఇచ్చారని, పోలీసులు చిన్న విషయాన్నీ పెద్దగా చూస్తున్నారని తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌తో తనకు సంబంధం లేదని అన్నారు. తనకు తెలిసిన అధికారి అయినందున తాను గతంలో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడినట్లు వెల్లడించారు.

ఓ కేసులో మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ నంబర్లు తిరుపతన్న అడిగారని, వారి ఇద్దరు ఫోన్ నంబర్స్ తన అనుచరులతో తీసుకొని అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకి ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. అదేవిధంగా ప్రచార సమయంలో అదనపు ఎస్పీ (సస్పెండెడ్‌) తిరుపతన్నతో మాట్లాడిన మాట వాస్తవమని తెలిపారు. అంతేకానీ ఫోన్ ట్యాపింగ్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని వివరించినట్లు పేర్కొన్నారు. పోలీసులు వాళ్ల దగ్గర ఉన్న ఆధారాలతో తనను పిలిచి విచారించారని, తాను సమాధానం చెప్పానన్నారు.

ఊపిరి పీల్చుకుంటున్న అధికారులు, నేతలు - నిన్నటి వరకు కాల్స్‌లో మాట్లాడాలన్నా భయమే - Officers and leaders got Freedom

పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తా : ఈ కేసులో ఎప్పుడు విచారానికి పిలిచినా తాను పోలీసులకు సహకరిస్తానని చెప్పుకొచ్చారు. అంతకముందు తెలంగాణ భవన్​కు చేరుకున్న చిరుమర్తి.. ఎమ్మెల్యేగా పనిచేసిన తనకు పలువురు అధికారులతో పరిచయాలు ఉంటాయని, మాట్లాడుతుంటానని అందులో తప్పేమీ ఉందని ప్రశ్నించారు. నోటీసులతో బెదిరించి తన గొంతు నొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అది ఎప్పటికీ నెరవేరదన్నారు. ఇప్పటి వరకు పోలీసుల చుట్టే తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడు రోజుల క్రితం పోలీసులు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇవాళ విచారణకు హాజరయి, అనంతరం మాట్లాడారు.

"తిరుపతన్నతో మాట్లాడిన కాల్ లిస్ట్ ఆధారంగానే నన్ను పోలీసులు విచారించారు. నాకు తెలిసిన అధికారి అందువల్ల నేను గతంలో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడిన మాట వాస్తవం. కేసులో ఇద్దరు వ్యక్తుల నంబర్లు కావాలన్నారు, ఆ విషయమై నేను అతనితో మాట్లాడటం జరిగింది. పోలీసుల దగ్గర ఏదో ఆధారం ఉంది. అందువల్ల నన్ను విచారించారని నేను భావిస్తున్నాను. నా స్టేట్మెంట్​ను వీడియో రికార్డ్ చేశారు. ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తాను."-చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే

సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ టాపింగ్ కేసు - భుజంగరావు, తిరుపతన్నలకు ఈ నెల 6 వరకు రిమాండ్‌ - Telangana Phone Tapping Case

ఫోన్​ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ - 'బీఆర్ఎస్ నేతల సూచనతో సెటిల్​మెంట్లు' - BHUJANGARAO ON PHONE TAPPING

ABOUT THE AUTHOR

...view details