PM Modi Visits Vemulawada Rajanna Temple : తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ప్రధాని మోదీ పర్యటించారు. ఈరోజు (మే 8వ తేదీ) ఉదయం ప్రధాని మోదీ వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మొదటగా రాజన్న ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్నకు కోడె మొక్కులు చెల్లిస్తే కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం.
వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రధాని - కోడె మొక్కులు చెల్లించుకున్న మోదీ - PM MODI VISITS VEMULAWADA TEMPLE - PM MODI VISITS VEMULAWADA TEMPLE
PM Modi At Vemulawada Rajanna Temple : రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ ప్రచారం సాగిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ మరోసారి తెలంగాణకు ఎన్నికల ప్రచారాన్ని విచ్చేశారు. మొదటగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
Published : May 8, 2024, 10:33 AM IST
|Updated : May 8, 2024, 1:32 PM IST
భక్తులు అత్యంతంగా విశ్వసించే కోడె మొక్కులను మోదీ కూడా చెల్లించుకున్నారు. అనంతరం రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలను నిర్వహించారు. మోదీకి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు, వేద ఆశీర్వచనాన్ని ఇచ్చారు. రాజన్న ఆలయ ఆవరణలో భక్తులకు పీఎం మోదీ అభివాదం చేశారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. వేములవాడ, వరంగల్లో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.