తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఈ నెల 16,17,18 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన!

PM Modi Telangana Tour Schedule: ప్రధాని నరేంద్రమోదీ మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి 16,17,18 వ తేదీల్లో తెలంగాణకు రానున్నారు. మూడు రోజుల పర్యటనలో ఆయన జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజ్​గిరిలో బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశముందని బీజేపీ రాష్ట్రనాయకత్వం తెలిపింది.

PM Modi Telangana Tour Schedule
PM Modi Telangana Tour Schedule

By ETV Bharat Telangana Team

Published : Mar 11, 2024, 3:46 PM IST

PM Modi Telangana Tour Schedule :తెలంగాణ లోక్​సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నబీజేపీఎన్నికల ప్రచారంలో స్పీడు పెంచింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) మార్చి 15 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. తెలంగాణలో 16,17,18 తేదీల్లో మోదీ పర్యటించే అవకాశాలు ఉన్నట్లు బీజేపీ(BJP) రాష్ట్రనాయకత్వం తెలిపింది. మూడు బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొనేలా పార్టీ వర్గాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. జగిత్యాల, నాగర్​ కర్నూల్, మల్కాజిగిరిల్లో ప్రధాని సభలు నిర్వహించాలని భావిస్తోంది. మూడు లోక్​సభ స్థానాలు కవర్ చేసే విధంగా ఒక్కో సభ పెట్టాలని బీజేపీ యోచిస్తోంది.

బీఆర్​ఎస్​కు షాక్​ - బీజేపీలో చేరిన మాజీ ఎంపీలు సీతారాం నాయక్​, నగేశ్

T bjp master plan on MP Elections : ఇప్పటికే ప్రధాని రెండురోజుల టూర్​తో కాషాయ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కాగా ఎన్నికల షెడ్యూల్(Lok Sabha Election Schedule 2024) తర్వాత టూర్​కు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కానుంది. ఏయే తేదీల్లో పర్యటించాలనే అంశంపై కసరత్తు జరుగుతోంది. మోదీ మూడు పర్యటనల్లో భాగంగా చివరి విజిట్​లో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ల పరిధిలో భారీ రోడ్ షో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్లమెంట్(PARLIAMENT) స్థానాల పరిధిలో ఓటర్లను బీజేపీ వైపునకు తిప్పుకోవడంపై కాషాయ పార్టీ దృష్టి కేంద్రీకరించింది.

లోక్‌సభ ఎన్నికల వేళ రసవత్తరంగా రాజకీయం - ఆపరేషన్ ఆకర్ష్​తో బీజేపీ బిజీబిజీ

సోషల్ మీడియా వారియర్స్​తో అమిత్​షా సమావేశం
మరోవైపు రేపు కేంద్రమంత్రి అమిత్​షా(Amit shah) తెలంగాణకు వస్తున్నారు. ఆయన ముందుగా సోషల్ మీడియా వారియర్స్​తో సమావేశం కానున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు ఎలాంటి పోస్టులు చేయాలి, వ్యూహాలు రచించాలనే అంశంపై వారితో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం ఎల్బీ స్టేడియంలో బూత్ అధ్యక్షులు, ఆపై అధికారులతో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 25 వేల మంది ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా చాటే విధంగా కమలం నేతలు వ్యూహరచన చేస్తున్నారు. హైకమాండ్ కూడా సరికొత్త రాజకీయ వ్యూహాలు రచిస్తూ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా అత్యధిక పార్లమెంట్ స్థానాల్లో విజయఢంకా మోగించాలనే సంకల్పంతో కాషాయ పార్టీ ముందుకుపోతోంది.

పార్లమెంట్ అభ్యర్థుల రెండో జాబితాకు బీజేపీ కసరత్తు- ఆశావహుల్లో నెలకొన్న ఉత్కంఠ

ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి ప్రయత్నం - గులాబీతోటలో కమల వికాసమే లక్ష్యంగా బీజేపీ ప్రచారం

ABOUT THE AUTHOR

...view details