ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

పులివెందులలో వైఎస్ భారతికి సమస్యల స్వాగతం - YS Bharti Election Campaign - YS BHARTI ELECTION CAMPAIGN

People Welcomed YS Bharti with Problems During Election Campaign వైనాట్ 175 అన్న జగన్​కు, టీడీవీ వైనాట్ పులివెందుల అంటూ కౌంటర్ ఇచ్చింది. దానికి తగ్గట్టుగానే సొంత నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు మారడంతో సీఎం సతీమణి రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న భారతికి ప్రజల నుంచి సమస్య తోరణం ఎదురవుతోంది. నాలుగేళ్లుగా తిరుగుతున్న తనకు ఇల్లు మంజూరు చేయలేదని ఓ వృద్ధురాలు బోరున విలపించడంతో భారతి మౌనంగా ఉండిపోయారు.

ys_bharti_election_campaign
ys_bharti_election_campaign (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 6, 2024, 10:39 PM IST

People Welcomed YS Bharti with Problems During Election Campaign:వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సీఎం సతీమణి వైఎస్ భారతికి పలు గ్రామాల్లో ప్రజలు సమస్యలతో స్వాగతం పలికారు. ఇటీవల వేంపల్లిలో భాస్కర్ రెడ్డి అనే రైతు పాస్ పుస్తకంలో జగన్ ఫోటో ఎందుకని భారతిని నిలదీసిన ఘటన మరువక ముందే చక్రాయపేట మండలంలో ఓ వృద్ధురాలు తనకు ఇల్లు లేదని ఇల్లు మంజూరు చేయాలని బోరను వినిపించారు. చక్రాయపేటలో ఇంటింటి ప్రచారం చేస్తుండగా లక్ష్మమ్మ అనే వృద్ధురాలను వైయస్ భారతి పలకరించారు. అదే సమయంలో ఆమె బోరను వినిపిస్తూ నాలుగేళ్లుగా ఇల్లు కావాలని అధికారులు చుట్టూ తిరుగుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ నిరాశావాదం- ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం సన్నగిల్లుతుందన్న సీఎం - CM YS Jagan

భారతితో మాట్లాడుతున్న సమయంలోనే వైసీపీ కార్యకర్త ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్​ని గెలిపించాలని వృద్ధురాలని కోరగా ఆమె అసహనం వ్యక్తం చేశారు. ముందు నాకు ఇల్లు మంజూరు చేయాలని ప్రదేయ పడ్డారు. అన్ని చూసుకుంటానని భారతి హామీ ఇచ్చి ముందుకు వెళ్లిపోయారు. కావలి సుభాషిని వైఎస్ భారతితో మాట్లాడుతూ నేను 12 మార్లు గృహ నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆమెతో మొరపెట్టుకున్నారు.

ఎన్డీఏది అభివృద్ధి మంత్రం - వైసీపీది అవినీతి తంత్రం: నరేంద్ర మోదీ - Narendra Modi lashed out at YCP

ఇప్పటికీ బోధ కొట్టంలోనే నివాసం ఉంటున్నానని ఆమె వైయస్ భారతికి వివరించారు. మేడిశెట్టి సుదర్శనమ్మ వైసీపీ ప్రభుత్వం నుంచి తమకు అమ్మఒడి రాలేదని తన కుమారుడికి గుండెలో చిల్లు పడినప్పటికీ వైద్యం చేసుకునేందుకు కనీస సౌకర్యాలు కూడా కనిపించని ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరికీ ఎలాంటి సమస్య ఉన్నా గానీ ప్రభుత్వం వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని వైఎస్ భారతి హామీ ఇచ్చారు. కానీ జగన్ ప్రభుత్వంలో అది కూడా పులివెందుల నియోజకవర్గంలో ఇంకా ప్రజలు సమస్యల పైన ఇల్లు మంజూరుపైన భారతికి మొరపెట్టుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రధాని నరేంద్ర మోదీ విశ్వజీత్‌- దేశం దశ, దిశ మార్చారు : నారా లోకేశ్ - Nara Lokesh Praises PM Modi

పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకు: ఇటీవల వేంపల్లెలో భారతి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కుమ్మరాంపల్లె మాజీ సర్పంచి భర్త, వైఎస్సార్సీపీ నాయకుడు భాస్కరరెడ్డి ఆమెకు ప్రశ్నల వర్షం కురిపించారు. పట్టాదారు పాసు పుస్తకాలపై రైతుల చిత్రాలు ఉండేలా చూడాలని ఈ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. సీఎం జగన్‌ ప్రతి సమావేశంలోనూ నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటున్నారు తప్ప ఒక్కసారి కూడా నా రైతన్న అని అనడం లేదని భారతి వద్ద ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కంగుతిన్న ఆమె భాస్కరరెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా విని వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతికి సమస్యలతో స్వాగతం పలుకుతున్న ప్రజలు (Etv Bharat)

ABOUT THE AUTHOR

...view details