PCC Committee on Joinings in Congress :తెలంగాణలో అధికార కాంగ్రెస్‌లో చేరేందుకు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో చేరేందుకు చొరవ చూపుతున్నారు. ఇటీవల కేసీ వేణుగోపాల్ రాష్ట్ర పర్యటన వచ్చినప్పుడు చేరికల విషయం చర్చకు వచ్చింది. ఎవరు పార్టీలో చేరేందుకు చొరవ చూపినా ఆహ్వానించాలని సూచించారు. అయితే గడిచిన పదేళ్లుగా క్షేత్రస్థాయిలో హస్తం పార్టీకి అండగా ఉంటూ భారత్ రాష్ట్ర సమితి, కమలం పార్టీకి ఎదురొడ్డి కొట్లాడిన కార్యకర్తలు, నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
Lok Sabha Elections 2024 : ఇప్పటివరకు అప్పటి అధికార పార్టీ నాయకులు పెట్టిన కేసులు ఎదుర్కొన్న పార్టీ శ్రేణులు, చోటా నాయకులు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారితో కలిసి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇంతకాలం కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిన నేతలు కాంగ్రెస్‌లో చేరితే కలిసి పనిచేయడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. అధికారం కోసమో, ఆస్తుల రక్షణ కోసమో బీఆర్ఎస్, బీజేపీకి చెందిన మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో హస్తం పార్టీలోకి వస్తున్నారు. అయితే డీసీసీ అధ్యక్షులకు తెలియకుండానే స్థానిక కాంగ్రెస్ నేతల ఆమాదముద్ర లేకుండా కొంతమందిని చేర్చుకుంటూ ఉండడంతో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
లోక్సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌లో చేరికల జోరు - ఆ వ్యూహంలో భాగమేనా!
ముగ్గురు సీనియర్ నాయకుల నేతృత్వంలో కమిటీ :ఈ పరిస్థితులను అధిగమించేందుకు పార్టీకి విధేయత చూపి, భావ సారూప్యత కలిగిన నాయకులను మాత్రమే చేర్చుకోవాలని ఏఐసీసీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కష్ట కాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయిలో నాయకుల అంగీకారంతో చేర్చుకునే దిశగా పీసీసీ చొరవ చూపుతోంది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు సీనియర్ నాయకుల నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు పీసీసీ వెల్లడించింది.