ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

మోదీ రాకతో రూ.2.10 లక్షల కోట్ల పెట్టుబడులు - 7.5 లక్షల మందికి ఉపాధి: పవన్ - PAWAN KALYAN SPEECH

సదుద్దేశం, సదాశయం ఉంటేనే ఏదైనా సాధ్యమేనన్న పవన్ కల్యాణ్​ - మోదీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకతాటిపై నడిపిస్తున్నారని వ్యాఖ్య

Pawan Kalyan Speech
Pawan Kalyan Speech (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2025, 6:35 PM IST

Updated : Jan 8, 2025, 8:16 PM IST

Pawan Kalyan Speech in Visakha Pubic Meeting: భారత్‌ను గొప్ప దేశంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​ అన్నారు. సదుద్దేశం, సదాశయం ఉంటేనే ఏదైనా సాధ్యమేనని పేర్కొన్నారు. మోదీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకతాటిపై నడిపిస్తున్నారని కొనియాడారు. విశాఖలో ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్​ ప్రసంగించారు.

ఆత్మనిర్భర్‌, స్వచ్ఛభారత్‌ నినాదాలతో మోదీ ప్రజల మనసు గెలుచుకున్నారని పవన్ అన్నారు. నాలుగోసారి సీఎం పదవి చేపట్టిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ప్రజలు బలంగా కోరుకున్నారని తెలిపారు. మోదీ రాకతో రాష్ట్రానికి రూ.2.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయని పవన్ వెల్లడించారు. పీఎం సడక్ యోజన ద్వారా గ్రామాలకు కూడా రోడ్లు వేస్తున్నామని అన్నారు.

మోదీకి అండగా ఉంటాం: అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనేది మోదీ ఆశయమన్న పవన్ కల్యాణ్‌, ఐదేళ్ల అవినీతి, అరాచక పాలనతో రాష్ట్రం అంధకారంలో కూరుకుపోయిందని తెలిపారు. అభివృద్ధి అంటే ఆంధ్రా అని చెప్పుకునేలా చంద్రబాబు కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో వెలుగులు నింపుతున్న మోదీకి అన్ని వేళలా అండగా ఉంటామని పవన్ కల్యాణ్​ అన్నారు.

ప్రజల రుణం తీర్చుకునేందుకే ఈ ప్రాజెక్టులకు శ్రీకారం: బలమైన భారత్ కోసం మోదీ పరితపిస్తున్నారని పవన్ కల్యాణ్‌ పేర్కొన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని, కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్మారని తెలిపారు. ప్రజల రుణం తీర్చుకునేందుకే ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పరిశ్రమలు అన్ని ప్రాంతాలకూ విస్తరించాలనేది మోదీ సంకల్పమని పవన్ అన్నారు.

బహిరంగ సభకు ముందు విశాఖకు వచ్చిన ప్రధాని మోదీకి గవర్నర్​ అబ్దుల్​ నజీర్​, సీఎం చంద్రబాబుతో కలిసి డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎంలు రోడ్​షో నిర్వహించారు.

పేదల చిరునవ్వు, మహిళల ఆశాదీపం 'నమో': నారా లోకేశ్

Last Updated : Jan 8, 2025, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details