TG High Court Allows KTR Take Lawyer to Trial: తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్‌కు ఊరట లభించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్ తన వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించింది. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారించిన కోర్టు దర్యాప్తు అధికారి, కేటీఆర్ కనిపించేలా మరో గదిలో న్యాయవాది కూర్చోవాలని ఆదేశించింది. అందుకు తగినట్లుగా ఏసీబీ కార్యాలయంలోని లైబ్రరీలో సదుపాయాలున్నట్లు ఏఏజీ కోర్టుకు వివరించడంతో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ రాంచంద్రరావు కేటీఆర్ వెంట వెళ్తారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆడియో, వీడియో రికార్డింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరగా కోర్టు నిరాకరిచింది.
దర్యాప్తు అధికారులు వాంగ్మూలాలను మార్చారు: అవివాశ్ రెడ్డి, సీబీఐ కేసులో దర్యాప్తు అధికారిపై అవినాశ్ ఆరోపణలు చేయడంతో ఆడియో, వీడియో రికార్డింగ్‌కు ఆదేశించినట్లు కేటీఆర్ తరపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. దర్యాప్తు అధికారి తన వాంగ్మూలాన్ని పూర్తిగా నమోదు చేయడం లేదని అవినాష్ రెడ్డి ఆరోపించడంతో ఆడియో, వీడియో రికార్డింగ్‌ను ఆదేశించినట్లు న్యాయమూర్తి తెలిపారు. ఏసీబీ దర్యాప్తుపైన కూడా అనుమానాలున్నాయని లగచర్ల దాడి ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి, ఇంకో కేసులో పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాలను దర్యాప్తు అధికారులు రాజకీయ ఒత్తిడి కారణంగా మార్చారని కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
మరోసారి కస్టడీకి విజయ్‌పాల్ - 27 కార్లతో విచారణకు తులసిబాబు
గురువారం విచారణకు న్యాయవాదితో ఏసీబీ కార్యాలయంలో హాజరు కావాలని ఏమైనా అనుమానాలుంటే కోర్టు సంప్రదించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు భోజన విరామ సమయం ముగిసిన వెంటనే కేటీఆర్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. విచారణకు వెళ్లే సమయంలో న్యాయవాదిని అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణను ఎదుర్కొనే సమయంలో న్యాయవాదిని అనుమతిస్తూ ఇదే ధర్మాసనం సైతం తీర్పు ఇచ్చిందని జస్టిస్ కె. లక్ష్మణ్ అన్నారు.
ఏఏజీ అభ్యంతరం వ్యక్తం: న్యాయవాదిని అనుమతించొద్దని ఏసీబీ తరఫున వాదించిన అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజినీకాంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవాదిని అనుమతిస్తే అభ్యంతరమెందుకని విచారణ గదిలోకి న్యాయవాది వెళ్లడం లేదు కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేటీఆర్, దర్యాప్తు అధికారి ఓ గదిలో ఉంటే వాళ్లిద్దరూ కనిపించేలా మరో గదిలో న్యాయవాది కూర్చుంటారని హైకోర్టు తెలిపింది. ఏసీబీ కార్యాలయంలో తగిన ఏర్పాట్లు ఉన్నాయా లేవా అని ఏఏజీని ప్రశ్నించగా వివరాలు సేకరించి చెబుతానని ఏఏజీ సమాధానమిచ్చారు. సాయంత్రం 4 గంటలకు ఉత్తర్వులిస్తామని హైకోర్టు పేర్కొంది. తిరిగి 4 గంటల తర్వాత ప్రారంభమైన విచారణ సందర్భంగా ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి కేటీఆర్ వెంట న్యాయవాదిని అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం చంద్రబాబు సెక్యూరిటీలో మార్పులు - రంగంలోకి కౌంటర్ యాక్షన్ టీమ్‌లు