Pawan Kalyan Meet Chandrababu Naidu : మలివిడత అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం - జనసేన కూటమి (TDP - Janasena Alliance) కసరత్తు చేస్తోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఆయన నివాసంలో కలిశారు. మలివిడత అభ్యర్థుల ఎంపికపై ఇరువురు నేతలు కీలక చర్చలు జరపారు. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరే అంశంపై గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య దాదాపు గంటన్నరపాటు చర్చలు సాగాయి. దిల్లీ పరిణామాలపైనా అధినేతలు మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు నేడు దిల్లీ వెళ్లనున్నారు.
రేపటి నుంచి నారా లోకేశ్ మలివిడత శంఖారావం పర్యటనలు :ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ శంఖారావం (Nara Lokesh Sankharavam) పూరించనుంది. ఐదు రోజులు పాటు 12 నియోజకవర్గాల్లో కార్యక్రమం నిర్వహించనున్నారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే మలివిడత శంఖారావం పర్యటనలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరవుతున్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి పర్యటన షెడ్యూల్ జిల్లాకు అందింది.
బీసీలకు అండ దండ టీడీపీ, జనసేన జెండా - బలహీనవర్గాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 'డిక్లరేషన్'
ముందుగా హిందూపురం పార్లమెంటు పరిధిలోని ఈ నెల 7న హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లోను శంఖారావం కార్యక్రమం నిర్వహించనున్నారు. రాత్రికి పుట్టపర్తిలో బస చేస్తారు. 8న పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లోను, 9న కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లోను, 10న ఉరవకొండ, అనంతపురం, శింగనమల నియోజకవర్గాల్లోను, 11న తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాలో శంఖారావం కార్యక్రమం నిర్వహించనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయా నియోజకవర్గ ఇన్‌ఛార్జులంతా కార్యక్రమం విజయవంతం చేసేందుకు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.
టీడీపీ, జనసేన పొత్తు పొడిచింది - వైఎస్సార్సీపీ జడిసింది!
అనంతపురం జిల్లాలో నారా భువనేశ్వరి : నిజం గెలవాలి పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటన కొనసాగుతుంది. నేడు అనంతపురం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో గుండె ఆగి చనిపోయిన కార్యకర్తల ఇళ్లకు వెళ్లి పరామర్శించి ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఇవాళ అనంతపురం, కల్యాణదుర్గం నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. పర్యటన అనంతరం కణేకల్లు క్రాస్‌లోని విద్యానికేతన్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో రాత్రి బస చేస్తారు. రేపు రాయదుర్గం, గుంతకల్లు నియోజకవర్గాల్లో 'నిజం గెలవాలి' కార్యక్రమంలో పాల్గొననున్నారు
సరికొత్త విధంగా బీసీ డిక్లరేషన్- ప్రతి ఒక్క బీసీ సోదరుడు హర్షించదగిన సమయం