Pawan Kalyan Criticized Jagan Behavior in Assembly Party Meeting:ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్‌కు ఇంకా తత్వం బోధపడినట్లు లేదని కూటమి శాసనసభ పక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. నెల రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలు చెప్తూ కుట్రలకు తెరలేపుతున్నాడని పవన్ కల్యాణ్ ఆక్షేపించారు.
సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలు రెచ్చకొట్టడం అతని అహంకార ధోరణికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతానని భ్రమ నుంచి ప్రజలు బయట పడేసినా ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమోనని ఎద్దేవాచేశారు. రాష్ట్ర అభివృద్ధికి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చంద్రబాబుకు తాను ,జనసేన పార్టీ నూటికి నూరు శాతం సహకరిస్తుందని స్పష్టం చేశారు.
చంద్రబాబు విజనరీ నాయకుడు- ఏపీ అభివృద్ధికి పాటుపడ్డారు: గవర్నర్ - Governor Speech in AP Assembly
Minister Nadendla Manohar:మిత్రపక్షాల మధ్య విబేధాలను జగన్ కోరుకుంటున్నారని ఆ అవకాశం ఇవ్వొద్దని కూటమి శాసనసభా పక్షం అభిప్రాయపడింది. కూటమి శాసనసభా పక్ష సమావేశంలో పార్టీల మధ్య సమన్వయంపై కీలక చర్చ జరిగింది. రాష్ట్ర స్థాయితో పాటు క్షేత్ర స్థాయిలోనూ మూడు పార్టీల శ్రేణులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పార్టీల మధ్య సమన్వయం కోసం ఓ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలన్నారు.
పార్టీల మధ్య సమన్వయ కమిటీల అవసరం ఉందని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ మూడు పార్టీల మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టులకు ప్రతిపాదనలు పంపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సొంత పార్టీ కార్యకర్తల పేర్లతో పాటు గెలుపునకు సహకరించిన మిత్రపక్ష నేతల పేర్లనూ సిఫార్సు చేయాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
నల్ల కండువాలు, బ్యాడ్జీలతో అసెంబ్లీకి - పోలీసులతో జగన్ దురుసు ప్రవర్తన - YS Jagan Fires on Police
ప్రమాదమా? కుట్ర పూరితమా! - మదనపల్లె సంఘటనపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష - CM React Office Fire Accident