ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధిస్తుంది: కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ - Union Minister Nirmala Sitharaman - UNION MINISTER NIRMALA SITHARAMAN

Nirmala Sitharaman: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా గీతం వర్సిటీలో నిర్వహించిన ‘వికసిత్‌ భారత్‌’ కార్యక్రమం ఆమె పాల్గొన్నారు. విద్యార్థులతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు.  రానున్న ఎన్నికల్లో 370 సీట్లు బీజేపీ, 400 పైగా సీట్లు ఎన్డీఏ పక్షాలతో కలిపి సాధిస్తుందిని ధీమా వ్యక్తం చేశారు.

Nirmala Sitharaman
Nirmala Sitharaman

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 3:35 PM IST

Nirmala Sitharaman: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 ఎన్డీయే పక్షాలతో కలిసి 400పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఆమె పర్యటించారు. అందులో భాగంగా గీతం వర్సిటీలో ‘వికసిత్‌ భారత్‌’ కార్యక్రమం కింద విద్యార్థులతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. తాము గెలిచే స్థానాల సంఖ్య స్థిర నిర్ణయాల అమలుకు దోహదం చేస్తుందన్నారు.

రానున్న ఎన్నికల్లో 370 సీట్లు బీజేపీ, 400 పైగా సీట్లు ఎన్డీఏ పక్షాలతో కలిపి సాధిస్తుందిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ విశాఖలో అన్నారు. విశాఖ గీతం విశ్వవిద్యాలయంలో వికసిత్ భారత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మల సీతారామన్‍ మాట్లాడుతూ దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం అభివృద్ధికి స్థిరమైన నిర్ణయాలు అమలు చేసే ప్రభుత్వం సాధించేందుకు ఈ సంఖ్య ఎంతో తోడ్పడుతుందని అన్నారు.

ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ అభివృద్ధిలో పదో స్థానం నుంచి 5వ స్థానానికి చేరుకోగలిగిందిని, భారత అభివృద్ధి సాధించడంలో ఇంకా వెనుకబాటు లో ఉంటుందన్న విమర్శలకు ఇదే సరైన సమాధానంని తెలిపారు. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. భారతదేశం అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. డిజిటల్ లావాదేవీలు అవసరమా అని పదేపదే అనుమానాలు వ్యక్తం చేసే మాజీ ఆర్థిక మంత్రికి గ్రామ గ్రామాన విస్తరించిన డిజిటల్ ఇండియా లావాదేవీలు 130 బిలియన్ మార్కు దాటిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నానని ఈ సందర్భంగా నిర్మల తెలిపారు.

Live: కేంద్ర బడ్జెట్​పై 'ఈటీవీ భారత్​' ప్రత్యేక చర్చ - ప్రత్యక్ష ప్రసారం

వికసిత్ భారత్ అంబాసిడర్లుగా యువతదే కీలక పాత్రని, లక్ష కోట్ల రూపాయలతో బడ్జెట్ను పరిశోధన అభివృద్ధి రంగాలకు కొత్త ఆవిష్కరణల కోసం కేటాయించాంని నిర్మల పేర్కొన్నారు. 22 వేల కోట్ల రూపాయలు రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులను చేయగలుగుతున్నామని.. కృత్రిమ మేధ ను వినియోగించుకోవడం దానిలో కొత్త ఆవిష్కరణలు వంటి వాటిలో భారత్ అగ్రగామిగా ఉందిని తెలిపారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు.
స్పెషల్ 'రామా బ్లూ' చీరలో నిర్మల- వరుసగా ఆరుసార్లు బడ్జెట్​ ప్రవేశపెట్టి రికార్డ్​

ABOUT THE AUTHOR

...view details