జగన్ మోసంపై ఆందోళన వద్దు,అధైర్యపడొద్దు - నిరుద్యోగులకు లోకేశ్ బహిరంగ లేఖ Nara Lokesh Open Letter to the Unemployed :తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తానని సీఎం జగన్ మాటలు నమ్మి మోసపోయిన నిరుద్యోగులెవ్వరూ ఆందోళన చెందవద్దని, అధైర్యపడొద్దని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేననే అధికార పగ్గాలు చేపట్టుతుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన అనంతరం టీచర్ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి జగన్ నిరుద్యోగులను అంధకారంలోకి నెడుతున్నారని వెల్లడించారు.
మెగా డీఎస్సీకి తిలోదకాలు - ఎన్నికల గుమ్మంలో మినీ డీఎస్సీతో 'జగన్నాటకాలు'!
DSC Unemployed :గత ఎన్నికల్లో మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగుల ఓటు బ్యాంక్‌తో జగన్ ముఖ్యమంత్రి అయ్యాడని లోకేశ్ పేర్కొన్నారు. ఇప్పుడు అదే ఓటు బ్యాంక్ సీఎం అనే పదవి నుంచి గద్దె దించడానికి సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. మెగా డీఎస్సీ హామీని జగన్ ఐదేళ్లపాటు మర్చిపోయాడని లోకేశ్ దుయ్యబట్టారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే డీఎస్సీ పరీక్ష నిర్వహణ సాధ్యం కాదని తెలిపారు.
Jagan Cheated the Unemployed :2013లో రద్దయిన అప్రెంటిస్‌షిప్ విధానాన్ని మళ్లీ తేవడమూ జగన్ నాటకంలో భాగమేనని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 50 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే, కేవలం 6100 ఖాళీలను భర్తీ చేయడం నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఉద్ఘాటించారు. జగన్ మాయమాటలు నమ్మొద్దని నిరుద్యోగులు అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన - జగన్‌కు ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరిక
TDP Janasena is in Power in the Coming Elections : టీడీపీ-జనసేన హయంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం లోకేశ్ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను ఎత్తివేస్తూ తెచ్చిన జీవో 117, అప్రెంటీస్‌షిప్ విధానాన్ని రద్దు చేస్తామని తెలియజేశారు. ఉపాధ్యాయులకు పూర్తి స్థాయి పేస్కేల్ అమలుచేస్తామని తెలిపారు.
' ప్రతిపక్ష నేతగా 23 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక 18 వేల ఖాళీలేనని మాట మార్చారు. 8,366 టీచర్ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఇన్ని ప్రకటనలు, హామీల అనంతరం చివరకు 6,100 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల డ్రామా మొదలు పెట్టారు ' అని లోకేశ్ లేఖలో పేర్కొన్నారు.