ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

'ప్రజలిచ్చిన బాధ్యతను నెరవేరుద్దాం'- కొత్త ఎమ్మెల్యేలు, ఎంపీలతో నారా లోకేశ్ - Lokesh Meeting with MLAs and MPs - LOKESH MEETING WITH MLAS AND MPS

Nara Lokesh Meeting with Party MLAs and MPs: ప్రజలు తమపై గురుతర బాధ్యత పెట్టారని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమైన ఆయన.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడాలని సూచించారు.

Nara_Lokesh_Meeting_with_Party_MLAs_and_MPs
Nara_Lokesh_Meeting_with_Party_MLAs_and_MPs (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 5, 2024, 5:19 PM IST

Nara Lokesh Meeting with Party MLAs and MPs:ప్రజలు తమపై గురుతర బాధ్యత పెట్టారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడాలని నేతలకు సూచించారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారు. లోకేశ్​ను కేశినేని చిన్ని, పెమ్మసాని చంద్రశేఖర్, లావు కృష్ణదేవరాయలు, భాష్యం ప్రవీణ్, ధూళిపాళ్ల ఇతర ప్రజాప్రతినిధులు కలిశారు. అద్భుతంగా పోరాడి గెలిచాం అంటూ లోకేశ్​ అభినందనలు తెలిపారు.

పిఠాపురంలో పవన్ గెలుపు- పేరు మార్పుపై స్పందించిన ముద్రగడ - Mudragada Reacts on His Name Change

అహంకారం నెత్తికెక్కి ప్రవర్తిస్తే 151సీట్లను 11కే ఎలా పరిమితం చేయొచ్చో ప్రజలు ఈ ఎన్నికల్లోచూపారని లోకేశ్ అన్నారు. మొదటి రోజు నుంచే ప్రజా సేవకులం అనే బాధ్యతతో ఉండాలన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీను నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందని లోకేశ్ పేర్కొన్నారు. కర్నూలులో వలసలు, పల్నాడు, ప్రకాశం తదితర ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారించేందుకు బాధ్యతగా కష్టపడదామని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

"అహంకారం నెత్తికెక్కి ప్రవర్తిస్తే 151సీట్లను 11కే ఎలా పరిమితం చేయొచ్చో ప్రజలు ఈ ఎన్నికల్లో చూపారు. మనం మొదటి రోజు నుంచే ప్రజా సేవకులం అనే బాధ్యతతో ఉందాం. యువగళం పాదయాత్రలో వచ్చిన ప్రతీ ప్రజా సమస్య నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. కర్నూలులో వలసలు నివారించాలి. పల్నాడు, ప్రకాశం తదితర ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారించాలి. ఈ రోజు నుంచే అందరం బాధ్యతగా కష్టపడదాం." - కొత్త ఎమ్మెల్యేలు, ఎంపీలతో లోకేశ్

తెలుగుదేశం మీసం తిప్పిన నారా లోకేశ్- సవాళ్లకు ఎదురొడ్డి నిలిచిన యువనేత - nara lokesh key role in tdp victory

ABOUT THE AUTHOR

...view details