ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

రాష్ట్ర మంత్రివర్గంలోకి లోకేశ్‌- కీలక బాధ్యతల అప్పగింతకు చంద్రబాబు నిర్ణయం - Nara Lokesh Join in AP Cabinet - NARA LOKESH JOIN IN AP CABINET

Nara Lokesh May Join in New Cabinet in AP: సుదీర్ఘకాలం పాదయాత్ర చేసి ఎన్డీయే విజయంలో కీలక భూమిక పోషించిన నారా లోకేశ్‌ రాష్ట్ర మంత్రివర్గంలో చేరడం ఖాయమని సమాచారం. తాను మంత్రి వర్గంలో చేరడం కన్నా పార్టీ పరంగా బాధ్యతలు తీసుకుంటానని స్వయంగా లోకేశ్ అప్పట్లో ప్రకటించగా.. మంత్రి వర్గంలో తన అవసరాన్ని చంద్రబాబు గుర్తించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Nara Lokesh May Join in New Cabinet in AP
Nara Lokesh May Join in New Cabinet in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 7, 2024, 9:21 AM IST

Nara Lokesh May Join in New Cabinet in AP :తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రాష్ట్ర మంత్రివర్గంలో చేరనున్నారు. ఆయనకు ప్రాధాన్యమున్న మంత్రిత్వ శాఖల బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల కథనం. సుదీర్ఘంగా యువగళం పాదయాత్ర చేసి ఎన్డీయే విజయంలో కీలక భూమిక పోషించిన నారా లోకేశ్‌ ఒక సందర్భంలో ఎన్నికల్లో గెలిచాక మంత్రి వర్గంలో చేరడం కన్నా పార్టీ పరంగా బాధ్యతలు తీసుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే.

కేంద్ర మంత్రివర్గంలో టీడీపీకి 4 స్థానాలు!- జనసేనకూ అవకాశం? - TDP join UNION CABINET

AP Cabinet Ministers List 2024 :తాజాగా ఓట్ల లెక్కింపు ముగిశాక విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి వర్గంలో లోకేశ్‌ చేరతారాలేదా అన్న దానిపై పార్టీ వర్గాల్లో గత రెండు రోజులుగా చర్చ జరుగుతోంది.

నారా లోకేశ్ రెడ్ బుక్ అర్థం ఇదేనా ?- మంగళగిరిలో భారీ ఫ్లెక్సీ - Nara Lokesh Red Book

Nara Lokesh Into the Cabinet Chandrababu Naidu Take Decision :ఈ విషయంపై తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. బయట ఉంటే కీలక విధాన నిర్ణయాలు, వాటి అమల్లో భాగస్వామ్యం ఉండదన్న ఉద్దేశంతోనే మంత్రి వర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గతంలో ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రిగా నారా లోకేశ్‌ బాధ్యతలు నిర్వహించారు. విశాఖ, మంగళగిరి, విజయవాడ కేంద్రాలుగా ఐటీ కంపెనీలు తీసుకురావడంలో, నరేగా తదితర శాఖల నిధులతో గ్రామాల్లో పాతిక వేల కిలోమీటర్లకుపైగా పొడవైన అంతర్గత రహదారుల నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈసారి ప్రభుత్వంలో మరింత కీలక భూమిక పోషించే అవకాశముంది.

తెలుగుదేశం మీసం తిప్పిన నారా లోకేశ్- సవాళ్లకు ఎదురొడ్డి నిలిచిన యువనేత - nara lokesh key role in tdp victory

ABOUT THE AUTHOR

...view details