ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఊరూవాడా యువనేత జన్మదిన వేడుకలు - సోషల్ మీడియాలో నారా లోకేశ్ ట్రెండ్​ - TDP

Nara Lokesh Birthday Celebrations: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టిన రోజు వేడుకలను తెలుగు తమ్ముళ్లు ఘనంగా చేస్తున్నారు. ఊరూవాడా కేకులు కట్ చేసి తమ యువనేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సామాజిక మాధ్యమాలలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. దీంతో 'హ్యాపీబర్త్​ డే ప్యూర్‌ హార్టెడ్‌ లోకేశ్' హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. మరోవైపు విదేశాలలో సైతం లోకేశ్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు.

Nara_Lokesh_Birthday_Celebrations
Nara_Lokesh_Birthday_Celebrations

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 4:01 PM IST

ఊరూవాడా యువనేత జన్మదిన వేడుకలు - సోషల్ మీడియాలో ట్రెండ్​లో నారా లోకేశ్

Nara Lokesh Birthday Celebrations: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ కేక్​లు కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకలను గుంటూరు జిల్లా మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు. మంగళగిరి స్త్రీ శక్తి ఆధ్వర్యంలో 200 మంది మహిళలు లోకేశ్ చిత్రపటంతో ర్యాలీ చేశారు. లోకేశ్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బస్టాండ్ కూడలిలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పార్టీ నేతలు లోకేశ్ పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువత ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.

మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో లోకేశ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 11 వందల కేజీల కేకును కట్ చేసి పంచిపెట్టారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అదే విధంగా చిరువ్యాపారులకు బడ్డీకొట్లు అందజేశారు. లోకేశ్ ఆయురారోగ్యాలతో ఉండాలని మత పెద్దలు సర్వమత ప్రార్థనలు చేశారు. లోకేశ్ జన్మదిన వేడుకల్లో ఓ తెలుగుదేశం కార్యకర్త ఎన్టీఆర్ వేషధారణలో అలరించారు.

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు రాజధాని రైతు పులి చిన్నా వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కృష్ణా నదిలో వంద అడుగుల ప్లెక్సీని పడవల మధ్య ఊరేగిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. నది తీరంలో తెలుగుదేశం నేతలు పసుపు రంగు పొగ బాంబులతో సందడి చేశారు.

స్కూబా డైవింగ్​​తో లోకేశ్​కు జన్మదిన శుభాకాంక్షలు

నారా లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా విశాఖలో ఓ అభిమాని వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్​ఎస్​ఎఫ్ అధ్యక్షడు ప్రణవ్‌ గోపాల్‌ స్క్యూబా డ్రైవ్‌తో విశాఖ సాగర గర్భంలోకి వెళ్లి నారా లోకేశ్ చిత్ర పటాన్ని ప్రదర్శించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోకేశ్​పై ఉన్న అభిమానంతో ఈ సాహస ప్రక్రియ చేపట్టినట్లు ప్రణవ్‌ వివరించారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెలుగుదేశం లోకేశ్ జన్మదిన వేడుకలను టీడీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ భవన్ ఎదుట ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర ఖాదీ బోర్డు మాజీ ఛైర్మన్ వెంకట సుధాకర్ యువనేత లోకేశ్​కు శుభాకాంక్షలు తెలిపారు.

తిరుపతి జిల్లా నాయుడుపేటలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన వేడుకలను టీడీపీ నేత సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో యువనేత లోకేశ్ జన్మదిన వేడుకలను టీడీపీ నేత నాగార్జున కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఏలూరు జిల్లా టీడీపీ ఇంఛార్జి రాధాకృష్ణ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి లోకేశ్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి ప్రత్యేకంగా తయారు చేయించిన కేకు కట్ చేశారు. తెలుగు యువత ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు.

మంగళగిరిలో దూకుడు పెంచిన నారా లోకేశ్ - ప్రముఖులతో భేటీ

పల్నాడు జిల్లా నరసరావుపేటలో నారా లోకేశ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పల్నాడు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు నాయకులు, కార్యకర్తలతో కలసి కేట్‌ కట్‌ చేశారు. చంద్రబాబు చేపట్టిన రా కదలి రా బహిరంగ సభలకు ప్రజలు తరలి వస్తుంటే సీఎం జగన్ వణికిపోతున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ చేసిన తప్పులు, పాపాలే వైసీపీకి శాపాలుగా మారాయని విమర్శించారు. ఒక్క అవకాశం పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువనేత లోకేశ్ జన్మదినం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు.

అనంతపురం జిల్లా రాయదుర్గంలో లోకేశ్ జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలతో కలిసి టీడీపీ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ నాగరాజు సంబరాలు జరుపుకున్నారు. కోనసీమ జిల్లా అంబాజీపేటలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ఆధ్వర్యంలో లోకేశ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో యువనేత లోకేశ్ జన్మదిన వేడుకలను తెలుగు యువత భాస్కర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. కర్నూలు జిల్లాలో నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా పాణ్యం టీడీపీ మాజీ ఎమ్మెల్యే చరిత్ర రెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

Nara Lokesh Birthday Celebrations Abroad: నారా లోకేశ్ జన్మదిన వేడుకలు విదేశాల్లోనూ ఘనంగా జరుగుతున్నాయి. అమెరికాలోని న్యూయార్క్‌ టైం స్క్వేర్ వద్ద లోకేశ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మన్నవ మోహనకృష్ణ యూత్ ఆధ్వర్యంలో కేక్‌ కట్ చేశారు. నారా లోకేశ్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జై లోకేశ్, జై మన్నవ అంటూ ట్రైం స్క్వేర్‌ వద్ద నినాదాలు చేశారు.

Nara Lokesh Hashtag Trending: నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు నుంచి ట్విట్టర్ వేదికగా లోకేశ్​కు జన్మదిన శుభాకాంక్షలు వెలివెత్తాయి. దేశ వ్యాప్తంగా నేడు ట్విట్టర్‌లో 'హ్యాపీబర్త్​ డే ప్యూర్‌ హార్టెడ్‌ లోకేశ్' హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. ట్విట్టర్లో అత్యధిక మంది అభిమానించే రాజకీయ వ్యక్తులలో లోకేశ్ 27 స్థానం దక్కించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details