ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం - పామాయిల్ రైతులు సంతోషంగా ఉన్నారు: ఎంపీ పుట్టా మహేశ్​ - MP Mahesh Kumar Palm Oil Price - MP MAHESH KUMAR PALM OIL PRICE

MP Putta Mahesh Kumar About NDA Government : ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని మంత్రి పుట్ట మహేశ్​ తెలిపారు. ఎన్నికల సమయంలో పామాయిల్ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నమని తెలిపారు. కేంద్ర మంత్రులతో అనేక సార్లు చర్చించగా ఇప్పుడు రూ. 27.5 శాతం పెంచేందుకు అవకాశం వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం పామాయిల్ రైతులంతా సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు.

MP Putta Mahesh Kumar Media Meeting in Eluru
MP Putta Mahesh Kumar Media Meeting in Eluru (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2024, 3:30 PM IST

MP Putta Mahesh Kumar Media Meeting in Eluru : పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరులో ఎంపీ మహేశ్​ కుమార్​ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పామాయిల్ ధరను పెంచేందుకు కేంద్ర మంత్రులతో అనేక సార్లు చర్చించగా ఇప్పుడు రూ. 27.5 శాతం పెంచేందుకు అవకాశం వచ్చిందని తెలిపారు. టన్ను రూ. 16,500 ధర పెరిగిందని అన్నారు. నీతి అయోగ్ సమావేశంలో చంద్రబాబు మాట్లాడంతో ఇది సాధ్యమైందన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం : ఎన్నికల సమయంలో పామాయిల్ రైతులు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారని గుర్తు చేశారు. వారి డిమాండ్లని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని అప్పుడే హామీ ఇచ్చామని తెలిపారు. అధికారంలోని వచ్చిన వెంటనే సంబంధిత అధికారులను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. అప్పుడు వారు కేవలం పామాయిల్​కు మాత్రమే ధరలు పెంచటం కుదరదు, పెంచితే ప్రస్తుతం ఉన్న అన్ని ఆయిల్ రేట్లను పెంచాల్సి ఉంటుందని వెల్లడించారు.

అలాగే దానికి నీతిఆయోగ్ కూడా ఒప్పుకోవాలని తెలిపారు. వెంటనే వారితో వీడియో కాన్ఫిరెన్స్​లో మాట్లాడి ఒప్పించామని వెల్లడించారు. అనంతం నీతిఆయోగ్ సభ్యులు ప్రధాన మంత్రితో చర్చించి దిగుమతి సుంకం పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం పామాయిల్ రైతులంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని వెల్లడించారు.

గంగమ్మ ఒడికి 2 వేల గణనాథులు- కోలాహలంగా కేసీ కెనాల్‌ - Lord Ganesh Immersion Celebrations

రైతులకు పెద్ద పీట : అలాగే వందే భారత్ రైలు ఏలూరులో ఆల్ట్​కు కేంద్రం ఎంతో సహకరించిందని తెలిపారు. చంద్రబాబు ప్రధాన మంత్రితో మాట్లాడి రూ. 12 వేల 500 కోట్ల నిధులు తీసుకొచ్చారని వివరించారు. రూ. 6వేల కోట్లతో పోలవరం డయాఫ్రం వాల్​ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. పొగాకు ఉత్పత్తులకు మంచి ధర పెంచేందుకు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు.

ఇవన్నీ వంద రోజులు ఎన్డీయే పాలనలో చంద్రబాబు నేతృత్వంలో చేసి చూపించామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేస్తోందని, అన్నదాతలకు అన్ని వేలల్లో తోడుగా, అండగా ఉంటామని తెలిపారు. రైతులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదిశగా ఎంపీ పుట్టా మహేష్​ కుమార్​ కృషి చేస్తున్నారని స్థానిక నేతలు వీరాంజనేయులు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్​లు అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీని రైతులు ఘనంగా సత్కరించారు.

విజయవాడ ముంపు బాధితులకు అండగా రాస్తా - ఉచితంగా గృహోపకరణాల సర్వీసింగ్ - Free Service to Vijayawada Victims

రైతులకు అలర్ట్ - ఈ-పంట నమోదు ప్రక్రియ పూర్తి చేసుకున్నారా? లేకుంటే అంతే సంగతులు! - government on e crop registrations

ABOUT THE AUTHOR

...view details