MLC Kavitha Fires on CM Revanth Reddy : యాదాద్రి ఆలయంలో ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కొండా సురేఖకు జరిగిన అవమానం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అగ్రవర్ణాలకు సంబంధించిన సీఎం రేవంత్, ఇవాళ యాదాద్రి ఆలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను(Bhatti Vikramarka), మంత్రి కొండా సురేఖను అవమానించే విధంగా వాళ్లను కింద కూర్చోబెట్టి, అగ్రవర్ణ నాయకులను పైన కూర్చోబెట్టడం వివక్షకు నిదర్శనం కాదా అని కవిత ప్రశ్నించారు.
ఇది చాలా దౌర్భాగ్యమన్న ఆమె, ఈ ఘటనపై సీఎం రేవంత్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఉమ్మడి నల్గొండలోని బీసీల హక్కుల సాధనకై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నల్గొండకు వచ్చిన ఆమె ముందుగా క్లాక్ టవర్ సెంటర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే(Mahatma Jyoti Rao Phule) విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని చిన్న వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై ప్రసంగించారు.
ఫూలే విగ్రహ ఏర్పాటుపై అప్పటిలోగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావాలి : కవిత