తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఫూలే విగ్రహ ఏర్పాటుపై అప్పటిలోగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావాలి : కవిత

MLC Kavitha Demands Installation of Phule Statue : జ్యోతిరావు పూలే విగ్రహాన్ని శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసే విషయంపై ఏప్రిల్ 11లోగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావాలని భారత్​ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి లేఖలు రాయాలన్న ఆమె, ఇదే విషయమై హైదరాబాద్​లోని ధర్నాచౌక్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు.

MLC Kavitha
MLC Kavitha Demands Installation of Phule Statue

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2024, 8:12 PM IST

MLC Kavitha Demands Installation of Phule Statue : జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసే విషయమై ఆయన జయంతి అయిన ఏప్రిల్ 11వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావాలని రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాసంఘాలు, ప్రొఫెసర్లు, తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసిన రౌండ్ టేబుల్ సమావేశం, మొత్తం 9 తీర్మానాలకు ఆమోదం తెలిపింది.

ఫూలేకు భారత రత్న ఇవ్వాలని, కేంద్రంలో ఓబీసీల కోసం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, త్వరితగతిన బీసీ జనగణన చేపట్టాలని కోరింది. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని, ఆర్నెళ్లలో స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేసింది. అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం ఏర్పాటుకు మద్దతుగా రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి లేఖలు రాయాలన్న భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత, ప్రతి జిల్లా, విశ్వ విద్యాలయాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైదరాబాద్​లోని ధర్నాచౌక్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి గ్రామం నుంచి 10, 15 పోస్టుకార్డులు పంపడం వంటి సూచనలు వచ్చాయని అన్నారు.

కాంగ్రెస్ పార్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది : కల్వకుంట్ల కవిత

అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం ఏర్పాటుకు అన్ని పార్టీలు మద్దతు తెలపాలి. పార్టీలన్నీ మద్దతు తెలుపుతూ ప్రభుత్వానికి లేఖ రాయాలి. ప్రతి జిల్లా, వర్సిటీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటిస్తాం. - కవిత, భారత్ జాగృతి అధ్యక్షురాలు

ఫూలే విగ్రహ ఏర్పాటు విషయంలో అప్పటిలోగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావాలి : కవిత

నిజామాబాద్ లోక్​సభ బరి నుంచి ఎమ్మెల్సీ కవిత ఔట్ - మరి ఎక్కడి నుంచి పోటీ అంటే?

స్పీకర్​కు వినతి పత్రం : అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ప్రతిష్టించాలంటూ ఎమ్మెల్సీ కవిత ఇటీవల కోరారు. ఈ మేరకు శాసన సభాపతి నివాసంలో స్పీకర్‌ గడ్డం ప్రసాదరావును కలిసి భారత జాగృతి తరఫున వినతి పత్రం ఇచ్చారు. ఏప్రిల్ 11వ తేదీలోపు ప్రభుత్వం ఈ విషయంపై మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని కవిత పేర్కొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే గతంలో భారత జాగృతి పోరాటంతో అసెంబ్లీలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని కవిత గుర్తు చేశారు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామగ్రామాన భారత జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి మాకు ఆహ్వానం అందలేదు : ఎమ్మెల్సీ కవిత

ABOUT THE AUTHOR

...view details