తెలంగాణ

telangana

ETV Bharat / politics

మోదీ-కేసీఆర్​ల మైత్రిబంధం దెబ్బతింటుందనే ఇన్ని రోజులు కవితను అరెస్టు చేయలేదు : జీవన్​రెడ్డి

MLC Jeevan Reddy on Kavitha Arrest : ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ సీఎం కేసీఆర్​ మైత్రి బంధం ఎక్కడ బెడిసి కొడుతుందోనని ఇన్ని రోజులు కవితను అరెస్టు చేయలేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్​ఎస్​ అధికారం నుంచి దిగిపోగానే, కవితను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ప్రధాని జగిత్యాల పర్యటనపై ఆయన విమర్శలు గుప్పించారు.

MLC Jeevan Reddy
MLC Jeevan Reddy on Kavitha Arrest

By ETV Bharat Telangana Team

Published : Mar 18, 2024, 7:43 PM IST

మోదీ-కేసీఆర్​ల మైత్రిబంధం దెబ్బతింటుందనే ఇన్ని రోజులు కవితను అరెస్టు చేయలేదు : జీవన్​రెడ్డి

MLC Jeevan Reddy on Kavitha Arrest : ప్రధాని మోదీ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసి, అమ్మకానికి పెట్టారని, బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా అన్నింటి ధరలు పెరిగాయని ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల బహిరంగ సభలో మోదీ ప్రసంగంపై ఆయన తాజాగా స్పందించారు. విజయ సంకల్ప సభా వేదికగా మోదీ అన్ని అబద్ధాలు చెప్పారని జీవన్​రెడ్డి విమర్శించారు. మోదీ ప్రసంగం నిర్మాణాత్మకంగా ఉంటుందని భావిస్తే, స్పష్టత లోపించిందన్నారు.

MLC Jeevan Reddy on Modi Speech : ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయరంగంపై మోదీ వ్యాఖ్యలు విస్తుగొలిపాయని, రైతుల అభివృద్ధి మాట దేవుడెరుగు, వ్యవసాయానికి పెట్టుబడి రెండింతలు పెరిగిందన్నారు. రాజకీయాలకు అతీతంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ఉద్యమం చేస్తుంటే స్పందించడం లేదని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత లేకపోతే అర్థమే ఉండదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే పసుపు సాగుతో గిట్టుబాటు కాక రైతులు సాగు చేయడం తగ్గించుకుంటున్నారన్న జీవన్​ రెడ్డి, నిజంగా రైతులను ఆదుకోవాలంటే పసుపు క్వింటాల్​కు మద్దతు ధర రూ.15,000 ఇస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను బీజేపీ మోసం చేసింది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఈ సందర్భంగా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ గురించి మోదీ మాట్లాడటం ఆశ్చర్యం కలిగించిందని జీవన్​రెడ్డి పేర్కొన్నారు. అధికారంలో ఉండి కూడా పట్టించుకోనిదెవరని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ సీఎం కేసీఆర్​ల మైత్రి బంధం ఎక్కడ బెడిసి కొడుతుందోనని, ఇన్ని రోజులు కవితను అరెస్టు చేయలేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్​ఎస్​ అధికారం నుంచి దిగిపోగానే ఆమెను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ప్రజలు మోదీ పాలన రెండుసార్లు చూశారని, ఇక చాలు అంటున్నారని, కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జీవన్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

రాముడిని కాకుండా మోదీని పూజించాలనేది బీజేపీ నేతల సిద్ధాంతం : జీవన్ రెడ్డి

మోదీ ప్రసంగం నిర్మాణాత్మకంగా ఉంటుందని భావిస్తే, స్పష్టత లోపించింది. మోదీ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసి అమ్మకానికి పెట్టారు. బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా అన్నింటి ధరలు పెరిగాయి. వ్యవసాయ రంగంపై మోదీ వ్యాఖ్యలు విస్తుగొలిపాయి. వ్యవసాయానికి పెట్టుబడి రెండింతలు పెరిగింది. పసుపు సాగుతో గిట్టుబాటు కాక రైతులు సాగు చేయడం తగ్గించుకుంటున్నారు. నిజంగా రైతులను ఆదుకోవాలంటే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి. ప్రజలు మోదీ పాలన రెండుసార్లు చూశారు. ఇక చాలు అంటున్నారు. కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. - ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి

'దేశానికి ఏం చేశారని బీజేపీ నేతలు విజయ సంకల్ప యాత్ర చేస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details