AP CM Chandrababu Innovative Idea : రహదారుల నిర్వహణపై వినూత్నంగా ఆలోచించానని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారుల నిర్వహణను అప్పగించే యోచన చేస్తున్నట్లుగా చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేసేందుకు ఆలోచిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
మెరుగైన రహదారులే లక్ష్యం : 'గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులపై లక్షలాది గుంతలు ఏర్పడ్డాయి. రోడ్ల మరమ్మతులకు 850 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో పనులు జరుగుతున్నాయి. జనవరిలో పండుగల సందర్భంగా రాష్ట్రానికి ఎవరైనా వస్తే మెరుగైన రహదారులు కనిపించాలనే లక్ష్యంతో, దృఢ సంకల్పంతో ముందుకుపోతున్నాం. మన దగ్గర(ఏపీ) డబ్బుల్లేవు ఆలోచనలు ఉన్నాయి. ఒక ఆలోచన దేశాన్ని, ప్రపంచాన్నే మారుస్తుంది' అని చంద్రబాబు తెలిపారు.
తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో : ఏపీలోని ఉమ్మడి ఈస్ట్‌గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఉన్న రహదారుల నిర్వహణ జాతీయ రహదారుల మాదిరిగా టెండరు పిలిచి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగిస్తాం. గ్రామం నుంచి మండల కేంద్రం వరకు ఎలాంటి టోల్ ఫీజు ఉండదు. మిగిలిన ప్రదేశాల్లో ఉంటుంది. అది కూడా కార్లు, లారీలు, బస్సులకు మాత్రమే యూజర్ ఛార్జీ ఉంటుంది. ఈ విధానం బాగుంటుందని సభ్యులందరూ భావిస్తే ప్రయోగాత్మకంగా అమలు చేద్దాం' అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు.
మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్‌గా మోదీ- ఐదో ప్లేస్‌లో చంద్రబాబు- సీఎం జాబితాలో టాప్ కూడా ఆయనే
ఏపీలో రెండున్నర లక్షల ఉద్యోగాలు - రిలయన్స్‌తో చంద్రబాబు ప్రభుత్వం భారీ ఒప్పందం