తెలంగాణ

telangana

ETV Bharat / politics

కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి - పార్టీ మారడం లేదని క్లారిటీ - Ex Minister Mallareddy Meets KTR

MLA Mallareddy Meets KTR : బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి కలిశారు. ఆయనతోపాటు కలిసి వెళ్లిన కుమారుడు భద్రారెడ్డి మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడం లేదని కేటీఆర్​కు తెలిపారు.

Malla reddy
MLA Mallareddy Meets KTR

By ETV Bharat Telangana Team

Published : Mar 8, 2024, 4:37 PM IST

MLA Mallareddy Meets KTR :మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిశారు. ఆయన కుమారుడు భద్రారెడ్డి కూడా కేటీ రామారావును కలిశారు. పార్లమెంటు ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని కేటీఆర్‌కు భద్రారెడ్డి చెప్పారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలవడంపై మల్లారెడ్డి పూర్తి వివరణ ఇచ్చారు. తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కళాశాల భవనాల కూల్చివేత గురించి కలిసినట్లు తెలిపారు. తాను పార్టీ మారడం లేదని బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy) స్పష్టం చేశారు.

Former Minister Mallareddy Latest News :గతంలో మల్లారెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరి ఎంపీ(Malkajgiri MP Seat) స్థానానికి తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. కానీ ఇప్పుడు కేటీఆర్‌ను కలిసిన భద్రారెడ్డి ఎంపీ పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. దీంతో మల్లారెడ్డి ఫ్యామిలీ కాంగ్రెస్​లో చేరనుందనే ప్రచారం జోరందుకుంది.

MLA Marri Rajasekhar Reddy College Demolish :మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు గురువారం కూల్చివేసిన విషయం తెలిసిందే. దుండిగల్‌లోని చిన్న దామరచెరువు ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్‌లో ఎమ్మెల్యే రాజశేఖర్‌ రెడ్డికి చెందిన ఏరోనాటికల్‌, ఎంఎల్‌ఆర్‌ఐటీఎం కళాశాలకు సంబంధించిన ఆరు తాత్కాలిక షెడ్లు, రెండు శాశ్వత భవనాలను అధికారులు కూల్చేశారు. దీనిపై అధికారులు పూర్తి వివరణ ఇచ్చారు.

చిన్న దామర చెరువు ఆక్రమించి పార్కింగ్‌ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. ఇందుకు సంబంధించి కాలేజీ యాజమాన్యానికి వారం రోజుల క్రితం నోటీసులను ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటిపై స్పందన రాకపోవడంతో మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో రెవెన్యూ, పోలీసు శాఖ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అయితే కళాశాల విద్యార్థులు, సిబ్బంది అడ్డుకోవడంతో కాసేపు రసాభాస జరిగింది.

Mallareddy Illegal College Road Demolished : గత నెలలో గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్‌ఎండీఏ లే అవుట్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి రోడ్డు వేశారని దానిని అధికారులు కూల్చేశారు. హెచ్‌ఎండీఏ లే అవుట్‌లో 2,500 గజాల స్థలం ఆక్రమించి రోడ్డు వేసినట్లు ఆరోపణలు రాగా అధికారులు కూల్చేశారు. ఈ విషయంపై గతంలో మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్‌ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆయన సీఎం అయిన తర్వాత కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి.

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడి కాలేజీ భవనాల కూల్చివేత - సీఎం సలహాదారుడిని కలిసిన మాజీమంత్రి

మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ - కాలేజీ కోసం వేసిన రోడ్డును కూల్చేసిన అధికారులు

ABOUT THE AUTHOR

...view details