Minister Uttam Kumar Reddy Fires on KCR :పొలం బాట కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. ఆదివారం నాడు కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మాజీ సీఎం అబద్ధాలు చెప్పడాన్ని ప్రజలు గమనించాలని కోరారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Uttam Comments on BRS :కేసీఆర్ డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారనిఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam on BRS) అన్నారు. పార్టీ మిగలదనే భయం ఆయనలో మొదలైందని విమర్శించారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అన్నారని, కానీ ఇంత తొందరగా ఏ పార్టీ కుప్ప కూలలేదని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మిగలదని, కేసీఆర్ కుటుంబసభ్యులు తప్ప భారత్ రాష్ట్ర సమితిలో ఎవరూ మిగలరని ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.
మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ తీరు హాస్యాస్పదం : మంత్రి ఉత్తమ్
విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ చెేప్పెవన్ని అబద్ధాలే :ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేసీఆర్ సహకరించలేదని లోకసభలోనే వెల్లడించారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చట్టం తనపని తానూ చేసుకుంటూ పోతుందని వెల్లడించారు. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఎటు వెళుతుందో చూడాలన్నారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందో తేలాల్సి ఉందని తెలిపారు.
"కాళేశ్వరం గురించి కేసీఆర్ మాట్లాడేందుకు సిగ్గుపడాలి. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు ఆ పార్టీ హయాంలోనే కూలిపోయింది. ఒక్క పిల్లరే కదా కుంగింది అని కేసీఆర్ అంటారు. అమెరికాలో బ్యారేజీ కుంగలేదా అని కేసీఆర్ ఎదురు ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం కోసం విద్యుత్ ఖర్చే ఏడాదికి రూ.10,000ల కోట్లు అవుతుంది. ప్రాజెక్టును కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు కేసీఆరే ఒప్పుకున్నారు." - ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి