Job Calendar in Telangana 2024 :తెలంగాణ శాసనసభ సమావేశాల్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్త చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. 2 లక్షల ఉద్యోగాలు కల్పించినా, మరో 20 లక్షల మంది ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారని, ప్రభుత్వం పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని శ్రీధర్‌బాబు తెలిపారు.
ప్రాక్టికల్ బోధన :పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు గ్రాడ్యుయేట్లలో కొరవడ్డాయని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. నైపుణ్యాల పెంపుపై పారిశ్రామికవేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించామని, 'యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ' స్థాపనకు ప్రతిపాదిస్తున్నామన్నారు. నైపుణ్యాల పెంపొందించే ఉద్దేశంతోనే 'యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ' స్థాపన జరుగుతోందని, అన్ని కోర్సులు 50 శాతం ప్రాక్టికల్ కాంపొనెంట్‌ను కలిగి ఉంటాయని స్పష్టం చేశారు.
స్కిల్ యూనివర్సిటీ యువతకు ఉపాధి కల్పిస్తుందని, రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. తెలంగాణలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు స్కిల్ వర్సిటీ ఊతమిస్తోందని తెలిపారు. 2024-25 సంవత్సరంలో 2000 మంది విద్యార్థులకు, వచ్చే ఏడాది 10 వేల మందికి శిక్షణ ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ముచ్చర్లలో స్కిల్ వర్సిటీ కోసం శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు ప్రతిపక్షాలు మద్దతు తెలపాలని కోరారు.
ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయాలి- మోసాలు ఆయనకు కొత్త కాదు: షర్మిల - YS SHARMILA TWEET ON JAGAN