Minister Sridhar Babu on Manair Bridge Collapse Issue : పెద్దపల్లి-భూపాలపల్లి జిల్లాల మధ్య గాలి దుమారానికి కుప్పకూలిన ఓడేడు వంతెన నాణ్యతపై విచారణ చేపట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య రాకపోకల కోసం మానేరువాగుపై తొమ్మిదేళ్ల క్రితం నిర్మాణం చేపట్టారు.
Under Construction Bridge Collapses in Manair Vagu :ఆగస్టు 2016లో అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు. ఈ వంతెన నిర్మాణం పూర్తి అయితే ఇరుగు పొరుగు జిల్లాల మధ్య దూరం తగ్గుతుందని చేపట్టారు. నిర్మాణంలో ఉన్న ఈ వంతెనకు సంబంధించి మూడు పిల్లర్లపైన అమర్చిన గట్కర్స్ సోమవారం రాత్రి కూలిపోయాయి. 2016 ఆగస్టు నెలలో రూ.49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులను మొదట్లో ప్రారంభించారు. దాదాపు 23 పిల్లర్లు నిర్మించారు.
ఈదురుగాలులకు కూలిన మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన - BRIDGE COLLAPSES IN MANAIR VAGU
"తొమ్మిదేళ్లుగా అరకొర పనులతో నిర్మాణంలో ఉన్న మానేరు వాగు వంతెన ఇవాళ కూలిపోయింది. దీనికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కారణం కాదా? కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ వాళ్లు లొల్లిపెట్టుకుంటున్నారని అంటున్నారు. మరి దీనికి వారేం సమాధానం చెబుతారు. నాణ్యతా లోపం అని తెలిసినప్పటికీ పట్టించుకోకుండా కాంట్రాక్టర్లకు మేలు చేయాలని, నాటి ప్రభుత్వ పెద్దలు తీసుకున్న నిర్ణయమే ఇవాళ్టి సంఘటనకు కారణం." - శ్రీధర్ బాబు, ఐటీ మంత్రి
గత ప్రభుత్వ అవినీతి వల్లే నాసిరకంగా నిర్మాణాలు - బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: శ్రీధర్‌బాబు నిధుల లేమి, ఇతరత్రా కారణాలతో ఇద్దరు గుత్తేదారులు పనులు నిలిపివేశారు. నిర్మాణం పూర్తికాక ముందే నేలకొరిగిందంటే, నాణ్యత లోపం ఉన్నట్లేనని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మేడిగడ్డలో ఏం జరగక ముందే రాజకీయం చేస్తున్నారని ఎదురు దాడికి దిగిన నాయకులు, దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ ఓడేడు బ్రిడ్జి నాణ్యతతో పాటు కంభంపల్లి వంతెన నాణ్యత కూడా పరిశీలించాలని కోరారు.
బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి పనులకు ఈ వంతెన నిదర్శనం : బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధికి సంబంధించిన వంతెన నిర్మాణం కూలడంతో, నాటి నిర్మాణం ఏ విధంగా ఉందో మరోసారి రుజువు అయిందని తెలుస్తోందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మహా ముత్తారం మండలంలో పెద్దపల్లి లోక్‌సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి గడ్డం వంశీ తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, బీఆర్ఎస్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై నాణ్యత, నిర్లక్ష్యం, ఇష్టారాజ్యంగా గుత్తేదార్లకు, బీఆర్ఎస్ అప్పటి ప్రజాప్రతినిధులకు మేలు చేయాలని ఉద్దేశంతో నిర్మాణం చేసినట్లు తెలిపారు. మంథని నియోజకవర్గం పరిధి ఓడేడులో హైలెవల్ వంతెన నిర్మాణం పూర్తి చేయకుండా గుత్తేదార్ల నిర్లక్ష్యం, నాణ్యతా లోపంతో వంతెన కూలిపోయినట్లు తెలిపారు. దీనిపై అప్పటి ప్రభుత్వ ప్రతినిధులను ప్రశ్నిస్తున్నామనన్నారు. ఈ ఘటనపై కచ్చితంగా పూర్తిస్థాయిలో విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణం చేశారా? తదతర అంశాలపై విచారణ చేస్తామన్నారు. ఒకవేళ రాకపోకలు సాగే సమయంలో కూలితే పెను ప్రమాదం సంభవించేదని తెలిపారు.
ఐదేళ్ల తర్వాత బయటపడ్డ గ్రామాలు- భావోద్వేగానికి గురైన మిడ్ మానేరు నిర్వాసితులు - MID Manair PROJECT EXPATRIATES
ప్రారంభించిన మరుసటి రోజే మూడు ముక్కలైన విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జి