Minister Seethakka Strong Counter To BRS MLA : శాసనసభ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదంయ 10 గంటలకు శాసనసభ ప్రారంభం అయ్యింది. నేడు మరో 19 పద్దులపై శాసనసభలో కొనసాగుతున్న జరుగుతోంది. వ్యవసాయం, సహకార, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, గృహనిర్మాణం, పౌరసరఫరాలు, పశుసంవర్ధక, పర్యాటక, క్రీడాశాఖలు, అటవీ, దేవదాయ, మైనార్టీ, చేనేత, స్త్రీ శిశు సంక్షేమశాఖ పద్దులపై సభలో చర్చ సాగుతోంది.
అసెంబ్లీలో పోడు భూమల సమస్యలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పోడుభూముల మస్యలపై మాట్లాడారు. పోడుభూముల పంపిణీలో గత ప్రభుత్వం అందరికీ న్యాయం చేసిందన్నారు. మంత్రి సీతక్క తండ్రికి సైతం తమ ప్రభుత్వమే పోడు భూమల పట్టాలు ఇచ్చిందన్నారు. గిరి వికాస్ పథకం కింద అన్ని ఎస్టీ కుటుంబాలకు రూ.2 లక్షలు ఇచ్చామని తెలిపారు. విద్యలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలను తీసుకువచ్చిందని వెల్లడించారు. గిరిజన రైతులకు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని, గిరిజనుల కోసం అనేక పథకాలు తీసుకువచ్చిందని పేర్కొన్నారు.
పవర్ వార్ : అసెంబ్లీ వేదికగా విద్యుత్ రంగంపై అధికార, విపక్షాల మధ్య హోరాహోరీ చర్చ - electricity debate in assembly 2024
ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీలకు ఏం చేయలేదన్నట్లుగా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీల కోసం 2006లో పోడుభూముల చట్టం తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టం ద్వారా అనేక గిరిజనులకు లబ్ధి చేకురిందని తెలిపారు.
పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ ఎస్టీలకు ఏం చేయలేదని, గులాబీ పార్టీ పదేళ్ల పాలనలో ఎంతమంది ఎస్టీలకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో ఎస్టీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని ఆరోపించారు. పదేపదే తన తల్లిదండ్రలకు భూమి ఇచ్చామంటున్నారని, తన తల్లిదండ్రులకు చట్టప్రకారమే పోడుభూముల హక్కు వచ్చిందని స్పష్టం చేశారు. తమవి అడవిని ఆధారంగా చేసుకుని బతికే కుటుంబాలని, ఆ భూమిపై సంప్రదాయంగా వచ్చిన హక్కు అది అని సీతక్క పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన భూమి కాదని తేల్చి చెప్పారు.
బీసీల కోసం లక్ష కోట్లు కేటాయిస్తామన్నారు - బడ్జెట్‌లో 20వేల కోట్లైనా పెట్టలేదు: కేటీఆర్ - telangana assembly session 2024