ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీతో మంత్రి మండిపల్లి భేటీ - కీలక ప్రాజెక్టులపై చర్చ - RAMPRASAD REDDY MEET NITIN GADKARI

దిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిసిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి - రాష్ట్ర రహదారుల విస్తరణ, కేంద్రం సహకారంపై చర్చ

Ramprasad_Reddy_meet_Nitin_Gadkari
Ramprasad_Reddy_meet_Nitin_Gadkari (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2025, 4:38 PM IST

Minister Ramprasad Reddy meet Nitin Gadkari:కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిల్లీలో కలిశారు. గడ్కరీ నివాసంలో సుమారు 45 నిమిషాల పాటు సమావేశమైన మంత్రి మండవల్లి పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీలో రవాణా శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. రోడ్డు భద్రతా ప్రమాదల నివారణలో భాగంగా కడప - రాయచోటి రహదారిని 4 లైన్ల రహదారిగా విస్తరించేందుకు సహకరించాలని కోరారు. ఈ మార్గంలో 4 కిలోమీటర్ల టన్నెల్ ఏర్పాటుకు అటవీ శాఖ అనుమతులు రాగానే పనులు చేపట్టేందుకు కేంద్రం సహకారం అందివ్వాలని మంత్రి రాంప్రసాద్ కోరారు.

అందులో భాగంగా రాయచోటిలో సెంట్రల్ రోడ్ విస్తరణ చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ క్రమంలో పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేయాలని మంత్రి కోరారు. రాజంపేట - రాయచోటి - కదిరి రహదారిని జాతీయ రహదారిగా మెరుగుపరిచేందుకు శాఖపరమైన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర మంత్రిని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో రవాణా అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details