Minister Ponnam Fires on BJP :వేలకోట్ల రూపాయల నల్ల డబ్బును బాండ్ల రూపంలో సేకరించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకొంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామంలో శ్రీరామ నవమి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రాముడి లాంటి పాలన దక్షత తమ ప్రభుత్వానికి ఇవ్వాలని శ్రీరామున్ని కోరుకున్నట్లు వెల్లడించారు.
రాజకీయ పార్టీలు బాండ్ల రూపంలో విరాళాలు సేకరించవచ్చునని ప్రధాని మోదీ స్వయంగా తెలపడాన్ని మంత్రి తప్పుబట్టారు. శరత్ చంద్ర రెడ్డి అనే వ్యక్తి బాండ్ల రూపంలో 500 కోట్ల రూపాయలు విరాళాలు ఇవ్వడంతో లిక్కర్ కేసులో ఆయనకు బెయిల్ వచ్చిందనీ, మరొక వ్యక్తికి రూ.100 కోట్లు ఇవ్వడం వల్ల ఆయనకు కాంట్రాక్టు వచ్చిందన్నారు. బీజేపీ వేల కోట్ల రూపాయలు రాజకీయ లబ్ధి కోసం సేకరించిందని, దీనిపై సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసి బాగోతం బయటపెట్టిందన్నారు.
ఏంటీ ఎన్నికల బాండ్లు? ఎందుకు రాజ్యాంగ విరుద్ధం? ప్రజాస్వామ్యానికి అంత నష్టమా?
"రాజకీయ పార్టీలు బాండ్ల రూపంలో కూడా చందాలు తీసుకోవచ్చనే విధానాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బాండ్లు అంటే గ్రామీణ ప్రజలకు తెలిసినా తెలియక పోయినా ప్రధానమంత్రి మొన్నటి ప్రకటనతో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఎవరైనా నల్ల ధనం ఉన్నవారు పార్టీలకు బాండ్ల రూపంలో ఇవ్వొచ్చు అని అర్థమయ్యింది. ఈ అంశాన్ని తప్పుపడుతూ బీజేపీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అందుకు నా ధన్యవాదాలు." -పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మంత్రి
Ponnam Prabhakar on Electoral Bonds :పెద్ద మొత్తంలో వచ్చిన ఈ బాండ్ల సొమ్మును రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ లబ్ధికి, క్విడ్ ప్రోకో కింద ఈ విధంగా దేశంలో ఉన్న నల్ల ధనాన్ని నేరుగా దోపిడీ చేపట్టటం, దీనిపై దేశ ప్రధాని మాటలు వింటుంటే తనకు రాజకీయ అవమానంగా అనిపించిందన్నారు. నల్ల డబ్బు ఉన్నోడిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి బాండ్ల రూపంలో సేకరించిన నల్ల డబ్బు మీ దగ్గరికి వస్తే తెల్లగా అవుతాయా అని కమలం పార్టీ అగ్ర నాయకులను ప్రశ్నించారు. ఈ ఘటనను చూస్తే ప్రధాని నల్ల ధనాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చునని, ఉత్తర భారతంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని పొన్నం అభిప్రాయ పడ్డారు.
బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ ప్రాంతీయ పార్టీలకు రూ.5వేల కోట్ల విరాళాలు- బీజేపీ కన్నా రూ.839 కోట్లే తక్కువ!
'ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వడంలో సెలక్షన్ వద్దు- అప్పట్లోగా మొత్తం సమాచారం అందించాల్సిందే'