CM Revanth Comments On PM Modi : మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని మోదీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం కోసం రేవంత్‌రెడ్డి ఇవాళ ముంబయి చేరుకున్నారు. అక్కడి పీసీసీ ఆఫీస్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. "తెలంగాణ సర్కార్ అమలు కానీ హామీలు ఇచ్చిందని మోదీ అన్నారు. తెలంగాణలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణాలు మాఫీ చేశాం. 22 లక్షల మంది రైతులకు 17,829 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. ఇందుకు సంబంధించి వివరాలు కావాలంటే ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం." అని సీఎం వెల్లడించారు.
తెలంగాణలో 10 నెలల్లోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్న రేవంత్‌రెడ్డి, మహారాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ సర్కార్‌పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్ధాలు చెబుతున్నారని, ఆయన అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే మేం నిజాలు చెబుతూనే ఉంటామని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారంటీల అమలుపై నిజాలు చెప్పేందుకు వచ్చానన్న ఆయన, ఇక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయని పేర్కొన్నారు.
17 మెగా ప్రాజెక్టులు గుజరాత్‌కు వెళ్లాయ్ : నల్ల చట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేయాలని ప్రధాని మోదీ భావించారని ఆరోపించారు. సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టినట్లు తెలిపిన రేవంత్‌రెడ్డి, దేశ చరిత్రలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉందని కొనియాడారు. ఇక్కడికి రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు గుజరాత్‌కు వెళ్లాయని ఆరోపించారు. ఇక్కడి ప్రజలను మోసం చేసిన బీజేపీని ఎన్నికల్లో ఓడించాలని రేవంత్‌రెడ్డి కోరారు.
"తెలంగాణ, ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల విషయంలో ప్రధాని నరేంద్రమోదీ, అబద్దాలు చెప్పడం మొదలుపెట్టారు. మోదీ అబద్దాలు చెప్పడాన్ని ఆపనంతవరకు, మేం నిజాలు చెప్పడాన్ని ఆపేదిలేదు. రైతులందరికీ రూ. 2లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటివరకు 22లక్షల 22వేల 67 మంది రైతులకు 17,869 కోట్ల రూపాయల అంటే దాదాపు రూ.18వేల కోట్లు రుణాలు మాఫీ చేశాం."-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
'ఏ బీజేపీ పాలిత రాష్ట్రంతో పోల్చినా తెలంగాణదే రికార్డు' : మోదీ విమర్శలకు రేవంత్ కౌంటర్
'సీఎం కావాలనుకున్నా, అయ్యాను - నా గేమ్ ప్లాన్‌పై పూర్తి స్పష్టతతో ఉన్నా'