Minister Surekha Apologized to Actress Samantha : నటి సమంతకు సంబంధించి బుధవారం తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ తాజాగా స్పందించారు. ఈ మేరకు నటి సమంతకు ఆమె క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమేనని, కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదని వివరణ ఇచ్చారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా అంటూ పేర్కొన్నారు. తన వ్యాఖ్యల వల్ల ఆమె కానీ, ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, అన్యద భావించవద్దని మంత్రి సురేఖ కోరారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
'మీ మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు' : సమంతకు మంత్రి సురేఖ క్షమాపణలు - Konda Surekha Apologize to Samantha - KONDA SUREKHA APOLOGIZE TO SAMANTHA
Konda Surekha Apologize to Actress Samantha : నటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. మంత్రి మాటలపై సమంత ఘాటుగానే స్పందించారు. ఆమెతో పాటు నాగార్జున, నాగ చైతన్య సహా సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సైతం మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. ఈ విషయం పెద్దది కావడంతో తాజాగా మంత్రి క్షమాపణలు తెలిపారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 3, 2024, 7:35 AM IST
"నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే. కానీ మీ @Samanthaprabhu2 మనోభావాలను దెబ్బ తీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే, బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. అన్యద భావించవద్దు." - కొండా సురేఖ, మంత్రి