Minister Komati Reddy on Mega DSC: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలిపారు. ప్రతి ఏడాది పది వేల ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని అన్నారు. ఫిబ్రవరి నెలలో మెగా డీఎస్సీ(Mega DSC in Telangana), మార్చిలో గ్రూప్-2 నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. వంద రోజుల్లో అభయ హస్తం గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. తమ పాలనలో హామీ ఇచ్చినవి, ఇవ్వనివి కూడా చేసేలా పని చేస్తామని భరోసా ఇచ్చారు.
Komati Reddy Interesting Comments : బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో రూ.6.31 కోట్లతో నిర్మాణం చేపడుతున్న బ్రిడ్జి పనులకు కోమటి రెడ్డిశంకుస్థాపన చేశారు. ఆరు నెలలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్ పనులు రూ.40 లక్షలతో పూర్తి చేస్తామన్నారు. అనంతరం ఆసుపత్రి నూతన భవనాన్ని ప్రారంభించారు. ఆలేరు నియోజకవర్గానికి మంత్రి హోదాలో మొదటిసారి రూ.100 కోట్లు అభివృద్ధి పనులకు మంజూరు చేశానని హర్షం వ్యక్తం చేశారు. గందమల్ల ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.
ఏప్రిల్ నాటికి దిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనులు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komati Reddy on Development Programmes : అఘాత్యాలకు బలైపోయిన బాలికల కుటుంబాలకు అండగా ఉంటామని, వారి కుటుంబాలకు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేేస్తామని మంత్రి(Komati Reddy) హామీ ఇచ్చారు. దీంతో పాటు వారి కుటుంబంలో అర్హులైన వారికి ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. రూ.17 కోట్లతో కొలనుపాక బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసుకున్నామని, జైన దేవాలయాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి రోజు రాష్ట్రంలో రూ.40 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారని గుర్తుచేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్య సాయం రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచమని అన్నారు. చీకటిమామిడి- వడపర్తి, నాగినేనిపళ్లి- అనంతారం, మర్యాల- చీకటిమామిడి రోడ్ల పనులు వారం రోజుల్లో టెండర్ పిలిచి పనులు చేస్తామని మంత్రి తెలిపారు.