Minister Gummanur Jayaram Resigns to YSRCP :తన మాటే శాసనం, తన నిర్ణయమే ఫైనల్ అంటూ, ఎమ్మెల్యేల మార్పులు చేర్పులతో ఏపీ సీఎం జగన్ సంచలనాలకు తెర తీశారు. కష్టకాలంలో తనతో నడిచిన వారికి సైతం మొండి చేయి చూపించారు. ఇన్నాళ్లు పార్టీ కోసం పని చేసిన నేతలకు టికెట్ కేటాయించే అంశంపై, అసంతృప్తిని సైతం పట్టించుకోకుండా ముందుకు సాగారు. ఇప్పటికే విడుదలైన 9 జాబితాల్లోనూ ఇదే తంతు పాటించింది వైఎస్సార్సీపీ అధిష్టానం. దీంతో అధికార పార్టీ కీలక నేతలు జగన్కు గుడ్ బై చెప్పారు. చెబుతున్నారు.
Minister Gummanur Jayaram Latest News :ఈ తరుణంలో వైఎస్సార్సీపీకి మరో షాక్ తగిలింది. గత కొంతకాలంగా సీఎం జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాం ఆ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకీ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. నేడు గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న'జయహో బీసీ (Jayaho BC)' సభలో చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. సీఎం జగన్ విధానాలతో విసుగుచెంది వైసీపీకకి రాజీనామా చేసినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గుంతకల్లు నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తానని వెల్లడించారు.
జగన్ గుడిలో విగ్రహం లాంటివారు : కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్ తనను అడిగారని జయరాం తెలిపారు. తనకు అది ఇష్టం లేదని అన్నారు. తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారని, గుడిలో శిల్పం మాదిరిగా జగన్ తయారయ్యారని ఎద్దేవా చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి చెప్పిందే ఆయన చేస్తున్నారని ఆరోపించారు.
పీకే వ్యాఖ్యలతో జగన్ ఉక్కిరిబిక్కిరి! - వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఓటమి భయం
రాజీనామాకు కారణాలు :గత నెలరాజ్యసభ ఎన్నికల దృష్య్టా పార్టీలో అసంతృప్త ఎమ్మెల్యేలను వైఎస్సార్సీపీ బుజ్జగించిది. అసంతృప్తితో ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాంకు తాడేపల్లి నుంచి పిలుపు రావడంతో సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ రామ సుబ్బారెడ్డి, సీఎంవోలో ధనుంజయరెడ్డితో సమావేశమయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరాంకు వచ్చే ఎన్నికల్లో ఆలూరు టికెట్ నిరాకరించారు.