Minister Anam Fire on YSRCP leader Vijaya Sai Reddy: వైఎస్సార్సీపీ నేత విజయ సాయిరెడ్డిపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ఎన్నికల ముందు A2 గురించి నేను చెప్పాను. ఆయన తండ్రి కూడా A2నే. ఆయన ఒక హత్య కేసులో ముద్దాయిగా ఉన్నారు. A2గా ఉంటే బాగుండదని A1గా మారేందుకు విశాఖపట్నంలో పలు కార్యక్రమాలు చేశారు. ట్విటర్ బాబాయిని ట్విటర్ తాతయ్య చేసి A1గా ముద్ర వేశారు. ఇలాంటి దుర్మార్గపు నాయకులు మనకు అవసరమా ? ఐదేళ్లలో దురాగతాలు చేశారు. నెల్లూరు ప్రజలు ఓడించి మంచి పని చేశారు. పాత్రికేయ సమావేశంలో తన మీద నిందలు వేసిన వారి గురించి మాట్లాడకుండా మీడియా గురించి బూతులు తిట్టారు. మంత్రి నారా లోకేశ్, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల గురించి ట్వీట్లు చేశారు. అప్పుడు కుటుంబ విలువలు గుర్తుకు రాలేదా ? శాంతి అనే ఉద్యోగి దేవాదాయ శాఖలో సహాయ కమిషనర్‌గా ఉంది. ఆమె ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉంది. 2019లో సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైంది. ఆమెకు విశాఖలో పోస్టింగ్ ఇచ్చారు’’ అని మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి తెలిపారు.
A2 నుంచి A1 కథేంటి? ట్విటర్ బాబాయ్ కాస్త ట్విటర్ తాతయ్య ఎలా అయ్యారు? - MINISTER ANAM FIRE ON VIJAYA SAI - MINISTER ANAM FIRE ON VIJAYA SAI
Minister Anam Fire on YSRCP leader Vijaya Sai Reddy: గత కొన్ని రోజులుగా వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై అనేక అరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో వాటికి వివరణ ఇచ్చుకోకుండా మీడియా సమావేశంలో జర్నలిస్టులపై విరుచుకపడటంపై కూటమి నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు విజయసాయిరెడ్డిపై సోషల్ మీడియాలో అనేక ట్వీట్లు చేస్తున్నారు. ట్విటర్ బాబాయ్ కాస్త ట్విటర్ తాతయ్య ఎలా అయ్యారో వివరిస్తున్నారు. అలాగే A2 నుంచి A1గా ఎలా మారారో విశ్లేషిస్తున్నారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 18, 2024, 10:56 PM IST
"ఆమెపై వచ్చిన ఆరోపణలపై కమిషనర్ స్థాయి అధికారులు విచారణ చేసి సస్పెండ్ చేశాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండే ఉంటే సస్పెన్షన్ జరిగేది కాదేమో. ఆమెకు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయి. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడ్డారు. విజయవాడలో విల్లా కొనుక్కోవాలని కమిషనర్‌కు అనుమతి కోసం దరఖాస్తు చేసింది. అందుకు కమిషనర్ అనుమతి ఇవ్వలేదు.అపార్ట్‌మెంట్ కొనుగోలుకు అనుమతించారు. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి చేసిన రెవెన్యూ దందాలో రెవెన్యూ న్యాయవాది సుభాష్, శాంతిల పాత్ర ఉందని మాకు సమాచారం ఉంది. ప్రభుత్వ భూములతో పాటు దేవాదాయ శాఖ భూములను కూడా అక్రమంగా కొల్లగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. వీటిపై కూడా విచారణ చేస్తున్నాం. దేవాదాయ శాఖ భూములను 99 సంవత్సరాల లీజుకు కూడా ఇచ్చారు. నివేదికలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతితో తదుపరి చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.