Mayawati Agrees to Alliance with BRS :లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అంగీకారం తెలిపారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సామాజిక మాధ్యమం(Social Media) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గులాబీ పార్టీ ప్రస్తుతం ఏ కూటమిలోనూ లేనందున అంగీకరించినట్లు ఆర్‌ఎస్ ప్రవీణ్ వెల్లడించారు.
ఎంపీ ఎన్నికల్లో గులాబీ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నట్లు, ఇరు పార్టీల పొత్తుపై త్వరలో కేసీఆర్‌తో తదుపరి చర్చలు ఉంటాయని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సీట్ల పంపకాల విషయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మాయావతి దూతగా బీఎస్పీ సమన్వయకర్త రాంజీ భేటీ కానున్నారని వెల్లడించారు. ఇటీవల ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన వ్యాఖ్యలతో సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే.
'సార్వత్రిక సమరంలో ఒంటరి పోరు- ఎన్నికల తర్వాత పొత్తు'- రిటైర్మెంట్పై మాయావతి క్లారిటీ
RS Praveen Kumar Clarity on BRS Alliance : రాబోయే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఎస్పీ,బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తుకు బీఎస్పీ అధిష్టానం అనుమతి ఉందని, పోటీ చేసే స్థానాలపై త్వరలోనే స్పష్టత వస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం రాత్రి ఎక్స్ వేదికగా స్పందించారు.
బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో(Parliament Elections) ఇతర పార్టీలతో పొత్తులు లేకుండా తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని చేసిన ప్రకటనపై వస్తున్న వదంతులు కేవలం ఎన్డీయే, ఇండియా కూటమిలను ఉద్దేశించినదే తప్ప, రాష్ట్రంలో బీఎస్పీ, బీఆర్ఎస్ మధ్యలో పొత్తులకు సంబంధించిన అంశం కాదని ఆయన స్పష్టం చేశారు.
అవన్నీ అసత్యకథనాలే : బెహన్జీ మాయవతి నేత్రత్వంలో త్వరలో ‘తృతీయ ఫ్రంట్’ ఏర్పాటు చేస్తున్నామని కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న అసత్య కథనాలపై వివరణ ఇచ్చారు. యూపీలో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని తెలిపిన ఆమె ఎన్డీయే, ఇండియా కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలతో కలసి పనిచేసే అంశంపై ప్రస్తావించలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అధినేత్రి మాయవతి చేసిన ట్వీట్ సారాంశాన్ని అర్థం చేసుకోకుండా కొన్ని మీడియా ఛానల్స్‌లో తప్పుడు ఊహాగానాలు చేస్తున్నారని, అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
ఇంతలోనే ఆ వార్తలన్నింటికి ఫుల్స్టాప్ పెడుతూ, రాష్ట్రంలో బీఆర్ఎస్తో పొత్తుకు ఇవాళ మాయావతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ట్వీట్ చేశారు. గతంలో తమ పార్టీ ఎన్డీయే, ఇండియా కూటమిలో(India Alliance) ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని పార్టీ స్పష్టం చేసిందని పునరుద్ఘాటించారు. మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఏ జాతీయ కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలతో గతంలో బీఎస్పీ పార్టీ పొత్తు కుదుర్చుకున్నట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో బీఎస్పీ,బీఆర్ఎస్ పార్టీల తరుపున పోటీ చేసే అభ్యర్థులను త్వరలోనే మీడియాకు వెల్లడిస్తామని, అసత్య ప్రచారాలను మీడియా ప్రసారం చేయొద్దని సూచించారు.
'రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్తో పొత్తు - వారంతా మా కూటమిని నిందించడం హాస్యాస్పదం'
తెలంగాణ రాజకీయాల్లో ట్విస్ట్ - లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు