Mallareddy not Contest the Next Election : వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(BRS MLA Malla Reddy) స్పష్టం చేశారు. ఈ ఐదేళ్లు ప్రజా సేవ చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెల్లడించారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(Malla Reddy Meet DK Shiva Kumar)ను కలిశారు. డీకే శివకుమార్‌తో ఉన్న ఫోటోపై మల్లారెడ్డి స్పష్టతను ఇచ్చారు. డీకే శివకుమార్‌ను కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని తెలిపారు.
గతంలో మల్కాజిగిరి ఎంపీ స్థానానికి తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పలు సందర్భాల్లో బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి చెప్పారు. కానీ ఈ కూల్చివేతలు జరిగిన తర్వాత కేటీఆర్‌ను కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చి చెప్పారు. అయితే ఆయన బీఆర్ఎస్కు కాస్త దూరంగా ఉంటున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి.
మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ - కాలేజీ కోసం వేసిన రోడ్డును కూల్చేసిన అధికారులు
Mallareddy Illegal College Road Demolished :గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ లే అవుట్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. హెచ్ఎండీఏ లే అవుట్లో 2500 గజాల స్థలం ఆక్రమించి మల్లారెడ్డి రోడ్డు వేశారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడ్చల్ కలెక్టర్ ఈ అంశంపై దృష్టి సారించారు. కలెక్టర్ ఆదేశాలతో మల్లారెడ్డి కాలేజీ రోడ్డును అధికారులు తొలగించారు. గతంలో మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి హెచ్ఎండీఏ లే అవుట్లో అక్రమంగా రోడ్డు వేశారని ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పుడు ఆ రోడ్డును అధికారులు తొలగించారు.
మల్లారెడ్డి అల్లుడు కాలేజి భవనాలు కూల్చివేత : మరోవైపు హైదరాబాద్ శివారు ప్రాంతం దుండిగల్‌లో ఉన్న బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు. ఇవి అక్రమ నిర్మాణాలు అంటూ మున్సిపల్ సిబ్బంది కూల్చేశారు. దుండిగల్‌లోని చిన్న దామరచెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి చెందిన రెండు కళాశాలకు సంబంధించి రెండు శాశ్వత భవనాలు, ఆరు తాత్కాలిక షెడ్లు ఉన్నాయి. వాటిని మున్సిపల్ అధికారులు కూల్చేశారు.
కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి - పార్టీ మారడం లేదని క్లారిటీ
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడి కాలేజీ భవనాల కూల్చివేత - సీఎం సలహాదారుడిని కలిసిన మాజీమంత్రి