ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్‌ - జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు - MLA Pinnelli bail petition

YSRCP MLA Pinnelli Approached High Court: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 6 వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. కాగా పోలింగ్‌ రోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఆయన ఏ1 నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

YSRCP_MLA_Pinnelli_Approached_High_Court
YSRCP_MLA_Pinnelli_Approached_High_Court (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 4:20 PM IST

Updated : May 23, 2024, 10:47 PM IST

YSRCP MLA Pinnelli Approached High Court: YSRCP MLA Pinnelli Approached High Court: మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్‌ రోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఆయన ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఈ ఘటనను ఈసీ సీరియస్​గా తీసుకోవటంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు.

పిన్నెల్లి అరాచకాల అడ్డాగా మాచర్ల- కనుసైగతో నియోజవర్గాన్ని శాసించిన ఎమ్మెల్యే - PINNELLI BROTHERS

మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం పరారీలో ఉండగా పోలీసులు 8 ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. బుధవారం హైదరాబాద్‌లో పిన్నెల్లి కారును గుర్తించిన ఏపీ పోలీసులు ఆయన డ్రైవర్‌, గన్‌మెన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు జూన్ 6 వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా పిన్నెల్లి సహా పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్‌పైనా ఆదేశాలిచ్చింది.

అయితే హైకోర్టును ఆశ్రయించడానికంటే ముందు, పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి లొంగిపోతాడని భావించి అప్రమత్తమైన పోలీసులు, కోర్టు ఆవరణలో పహారా కాశారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పిన్నెల్లి డ్రైవర్‌, గన్‌మెన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి కోసం 8 ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ పిన్నెల్లిని పట్టుకోలేకపోయారు.

నరసరావుపేటలో టెన్షన్​ - పిన్నెల్లి కోసం కోర్టు ఆవరణలో పోలీసుల పహారా

ఈవీఎం విధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని తెలంగాణలోని సంగారెడ్డి సమీపంలో బుధవారం అరెస్టు చేసినట్లు వార్తలు వినిపించాయి. ఇస్నాపూర్‌ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్‌హౌస్‌లో అరెస్టు చేసినట్లు, ఇస్నాపూర్‌ లొకేషన్‌ గురించి పటాన్‌చెరు పోలీసులను అడిగిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇస్నాపూర్‌ వరకు తెలంగాణ పోలీసుల సహకారం తీసుకొని పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారనే వార్తలు వ్యాప్తిలోకి వచ్చాయి. కానీ, పిన్నెల్లిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు.

పిన్నెల్లిపై కేసులు:ఇప్పటికే మాచర్ల ఈవీఎం ధ్వంసం ఘటనపై ఆగ్రహంగా ఉన్న ఈసీ, పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు హెదరబాద్​ సహా పలు ప్రాంతాల్లో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పిన్నెల్లిపై పది సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్లు, ఏపీ సీఈఓ ఎంకే మీనా వెల్లడించారు. తాజాగా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పుతో ఆయనకు కొంత ఊరట లభించినట్లైంది.

పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటన - నరసరావుపేటలో మరోసారి సిట్‌ విచారణ

Last Updated : May 23, 2024, 10:47 PM IST

ABOUT THE AUTHOR

...view details