Lok Sabha Elections 2024 : చిన్నపిల్లలు పాఠశాలలో చేరే ముందు వారి పూర్తి సమాచారాన్ని తల్లిదండ్రులు ఏ విధంగా ఉపాధ్యాయులకు అందజేస్తారో అలానే ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి వారి సమాచారాన్ని తెలియజేయాలి. ఇందులో అభ్యర్థి స్థిర, చరాస్తుల వివరాలు, కేసుల సమాచారం తదితర అంశాలను పొందుపరచాలి. ఏమైనా తప్పుడు సమాచారాన్ని ఇచ్చామని ప్రత్యర్థులు గుర్తిస్తే ఆయుధంగా మారే అవకాశం ఉంది. అందుకే ఎన్నికల్లో విలువైన వాటిలో అఫిడివిట్(ప్రమాణ పత్రం) ఒకటి. కొన్ని సందర్భాల్లో తప్పుడు సమాచారాన్ని(Wrong Information in Affidavit) ఇచ్చారని తెలిస్తే ఆ అభ్యర్థి అనర్హత వేటుకు దారితీయొచ్చు. లోక్‌సభ ఎన్నికల వేళ అభ్యర్థులు అఫిడవిట్‌ను ఎలా నింపాలో ఓసారి తెలుసుకుందామా?
Lok Sabha Election Affidavit:స్థిర, చరాస్తుల వివరాలతో పాటు చేతిలో, బ్యాంకు ఖాతాల్లోని నగదు, డిపాజిట్లు, ఇతర సేవింగ్స్, బీమా పాలసీలు, అప్పులు తదితరాలు పొందుపర్చాలి. వాహనాలు, వాణిజ్య స్థలాలు, ఆభరణాలు, వ్యవసాయ భూములు, నివాస స్థలాల వంటి వాటిని అఫిడవిట్లో ప్రస్తావించాలి. వారసత్వంగా వచ్చాయా, కొనుగోలు చేశారా అన్నది తెలపాలి. స్థిరాస్తులకు సంబంధించిన ప్రస్తుత మార్కెట్ విలువను అందులో వివరించాలి. అభ్యర్థితో పాటు కుటుంబ సభ్యుల రుణాలు, ఆదాయ మార్గాలు గురించి అందులో వివరించాలి. ప్రభుత్వ లేదా ప్రైవేటు కంపెనీల కాంట్రాక్టులు ఉంటే వాటి వివరాలు బయటపెట్టాలి.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హీట్ - ప్రచారాల్లో జోరు పెంచిన ప్రధాన పార్టీలు - LOK SABHA ELECTIONS 2024
అభ్యర్థిపై ఏదైనా కేసులు, క్రిమినల్ కేసులు, న్యాయ స్థానాలు శిక్ష విధించినా తదితర అంశాలను, సామాజిక మాధ్యమాల ఖాతాలను తెలపాలి. అన్ని వివరాలతో కూడిన అఫిడవిట్‌కు నోటరీ తప్పని సరి. సాధారణంగా నామినేషన్ దాఖలు సమయంలో రిటర్నింగ్ అధికారి అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను ప్రముఖ దినపత్రికల్లో స్పష్టంగా కనిపించేలా ప్రకటనలివ్వాలి.
Farm-26 Importance : అఫిడివిట్లోని ఏ ఒక్క కాలమ్ ఖాళీగా వదలరాదని ఈసీ స్పష్టం చేసింది. అభ్యర్థులకు సంబంధం లేని కాలంలో వర్తించదు లేదా నిల్ అని రాయాలని ఈసీ సూచించింది. అభ్యర్థి ఇచ్చిన ప్రమాణపత్రాన్ని గమనించి ఏదైనా సమాచారం లేకపోతే ఆర్వో నోటీసు ఇస్తారు. అప్పుడు సవరించిన అఫిడవిట్(Details in Affidavit)ను అభ్యర్థి ఈసీకి అందించాలి.