KTR Tweet on Telangana Decade Development: జూన్ 2తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకునేందుకు రాష్ట్రం సిద్దమవుతోంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇది తెలంగాణ దశాబ్ది అంటూ పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో సాధించిన విజయాల గురించి తన అధికార ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. వాటికి సంబంధించిన చిత్రాలను షేర్ చేశారు.
KTR on BRS Development: మాజీ సీఎం కేసీఆర్ పాలన సాక్షిగా 1000 సంవత్సరాలైనా చెక్కు చెదరని పునాది బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిందని కేటీఆర్ తెలిపారు. ఆరున్నర దశాబ్దాల పోరాటం, మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు, వేల బలిదానాలు, త్యాగాలు, బిగిసిన సబ్బండ వర్గాల పిడికిళ్లు, ఉద్యమ సేనాని అకుంఠిత, ఆమరణ దీక్ష, ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారం అయిందని పేర్కొన్నారు. ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగా స్వతంత్ర భారతదేశం ముందెన్నడూ చూడని సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి నమూనా ఆవిష్కృతమైందని వివరించారు.
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది : కేటీఆర్ - MLC Election KTR Campaign
KTR Tweet on Telangana Decade: పల్లె, పట్నం తేడా లేకుండా ప్రగతి రథం పరుగులు తీసిందని కేటీఆర్ అన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి నుంచి ఐటీ ఎగుమతుల వరకు రికార్డులు బద్దలయ్యాయని తెలిపారు. అందరి మద్దతుతో నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచామని, నిరంతర కరెంటిచ్చి వెలుగులు నింపామని చెప్పుకొచ్చారు. రైతన్నల, నేతన్నల, కష్టజీవుల కలత తీర్చి కడుపు నింపినట్లు వివరించారు. వృద్ధులకు ఆసరా అయ్యామని, ఆడబిడ్డలకు అండగా నిలిచినట్లు తెలిపారు. సకల జనుల సంక్షేమానికి తెలంగాణను చిరునామా చేసినట్లు పేర్కొన్నారు. గుండెల నిండా జై తెలంగాణ నినాదంతో మన భాషకు పట్టం గట్టామని, మన బతుకమ్మ, మన బోనాన్ని సగర్వంగా తలకెత్తుకున్నట్లు పేర్కొన్నారు. అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్న గడ్డ మీదనే తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని అంబరమంత ఎత్తున ఎగరేశామన్నారు.
KTR Tweet on Farmers Problems: మరో ట్వీట్లో ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు కాంగ్రెస్ ఆరు నెలల పాలనలోనే ఆవిష్కృతమయ్యాయని కేటీఆర్ విమర్శించారు. జోగిపేటలో విత్తనాల కోసం రైతులు పాసు పుస్తకాలు క్యూలో పెట్టిన చిత్రాన్ని ఎక్స్‌లో పంచుకున్నారు. కాంగ్రెస్ తప్పులతో అన్నదాతకు తిప్పలు ఆగడం లేదని ధ్వజమెత్తారు. పదేళ్లలో కనిపించని కరెంట్ కోతలు, విద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను ఇప్పుడు చూస్తున్నామని పేర్కొన్నారు. సాగునీరు లేక ఎండిన పంట పొలాలు, పాత అప్పు కట్టాలంటూ రైతులకు నోటీసులు చూస్తున్నామని, రైతుబంధు కోసం పడిగాపులు కాశామని, తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేని దుస్థితి కాంగ్రెస్ పాలనలో ఆవిష్కృతమైందంటూ దుయ్యబట్టారు.
ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా 30 వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు : కేటీఆర్ - KTR MLC Election Campaign
నాంపల్లి మల్టీలెవల్ కారు పార్కింగ్‌ను కాంగ్రెస్ పూర్తి చేయడం సంతోషకరం : కేటీఆర్ - KTR Tweet Multi Level Car Parking