KTR Tweet On Power Cuts in Telangana :ప్రజలు ఆలోచించి ఈ నెల 13వ తేదీన ఓటు వేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలున్నాయన్న ఆయన, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ప్రత్యామ్నాయంగా కరెంటు పరికరాలను చేర్చారు. ప్రజలందరూ ఇన్వర్టర్లు, ఛార్జింగ్ లైట్లు, టార్చ్ లైట్లు, క్యాండిళ్లు, జనరేటర్లు, పవర్ బ్యాంకులు సిద్ధంగా ఉంచుకోవాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పని తీరును ఎద్దేవా చేశారు. వాటిని మెన్షన్ చేస్తూ ఇది కాంగ్రెస్ ప్రభుత్వమని, బీఆర్‌ఎస్ సర్కార్ కాదని ట్వీటారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు బీజేపీని కూడా విమర్శిస్తూ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. డీ-మానిటైజేషన్ విఫల ప్రయత్నమని ప్రధాని మోదీ భావిస్తున్నారా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన సమయంలో కాంగ్రెస్‌కు అదానీ, అంబానీలు టెంపోల నిండుగా డబ్బు పంపుతున్నారని ప్రధాని మోదీ అన్నారని, ఆయన మాట ప్రకారం కాంగ్రెస్‌కి వాళ్లు అంతగా డబ్బు పంపుతుంటే ఈడీ, సీబీఐ, ఐటీలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను స్కాంగ్రెస్‌గా అభివర్ణించారు. మోదీకి ఇష్టమైన ఈడీ, సీబీఐలు స్కాంగ్రెస్ విషయంలో ఎందుకు మిన్నకుండి పోయాయని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
కాంగ్రెస్‌ను నమ్మి ఓటేసినప్పుడల్లా ప్రజలను మోసం చేసింది : కేటీఆర్ - KTR Comments on Congress Party