తెలంగాణ

telangana

ETV Bharat / politics

రేవంత్‌రెడ్డి చేసేది ఫోర్త్ సిటీ కాదు - ఫోర్ బ్రదర్స్ సిటీ - అంతా నాటకాలు : కేటీఆర్ - KTR Fires on CM Revanth - KTR FIRES ON CM REVANTH

ఫార్మాసిటీ స్థలాలను ఫ్యూచర్ సిటీకి కేటాయించడంపై బీఆర్ఎస్ మండిపాటు - పేదల భూములు గుంజుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ పని : కేటీఆర్

KTR Participated in Farmers Protest At Maheshwaram
KTR Participated in Farmers Protest At Maheshwaram (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2024, 2:20 PM IST

Updated : Oct 5, 2024, 4:05 PM IST

KTR Participated in Farmers Protest At Maheshwaram :ఎంతో శ్రమించి ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి సేకరించిన భూమిలో ఫోర్త్ సిటీ ఎలా కడతారని బీఆర్ఎస్ కార్యనిర్వాకుడు కేటీఆర్ ప్రశ్నించారు. మహేశ్వరం కందుకూరులో రైతు ధర్నా కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి ఫోర్త్ సిటీ నిర్మాణంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ధర్నా వద్దకు భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు చేరుకున్నారు. ఈ సందర్భంగా అర్హులందరికీ రూ.2లక్షల రుణమాపీ చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఒక్కో ఎకరానికి రూ.15 రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఫ్యూచర్ సిటీ అంటూ నాటకాలు ఆడుతున్నారు : సీఎం రేవంత్ రెడ్డి చేసేది ఫోర్త్ సిటీ కాదని ఫోర్ బ్రదర్స్ సిటీ అన్నారు. పేదల భూములు గుంజుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం పని అని విమర్శించారు. 2015- 22 వరకు ఎంతో శ్రమించి ఫార్మా సిటీ కోసం రైతుల నుంచి 14,000 ఎకరాలు సేకరించామన్నా ఆయన ఆ భూములు ఫార్మాసిటీకి తప్పా ఫ్యూచర్ సిటీకి వినియోగించడడాకి వీలులేదన్నారు. ఏఐ సిటీ, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో రైతులు, ప్రజలు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని సూచించారు.

"పేదల భూములు గుంజుకోవడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ పని. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ఫ్యూచర్ సిటీ ఎలా కడతారు? ఏఐ సిటీ, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారు. రేవంత్‌రెడ్డి చేసేది ఫోర్త్ సిటీ కాదు ఫోర్ బ్రదర్స్ సిటీ. రానున్న పంచాయతీ ఎన్నికల్లో రైతులు, ప్రజలు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి." - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు

ఫించనే ఇస్తలే కానీ మూసీ సుందరీకరణ అంట :బోనస్ పేరుతో బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. వడ్లకు బోనస్‌ ఇస్తా అని చెప్పారు కానీ ఇప్పటివరకు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ వస్తే రూ.4వేలు పింఛన్‌ ఇస్తా అని ఇంకా ఇవ్వలేదన్న ఆయన మూసీ సుందరీకరణకు లక్షా యాభై వేల కోట్లు ఖర్చుకు చేస్తారంట అని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డికి కమీషన్ల పిచ్చి తప్పా ప్రజల సంక్షేమం పట్టదని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి సీఎం సీటు కాపాడుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

'బడుగుల గొంతులను నీ బుల్డోజర్లు ఆపలేవు' - తన కాన్వాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ కేటీఆర్​ ట్వీట్​ - KTR and Harish on Congress Attack

అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న అందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారని, డిసెంబర్ 9 పోయి ఈ ఏడాది అక్టోబర్ 9 వస్తుంది మరి ఎంతమందికి రుణమాఫీ అయ్యిందని ప్రశ్నించారు. ఆ తర్వాత ఆగస్టు 15 కల్లా రైతులందరికీ రుణమాఫీ చేస్తానని మళ్లీ చెప్పారని గుర్తు చేసిన ఆయన మరి ఇప్పటి వరకు రుణమాఫీ కావాల్సిన రైతులు ఎందరో ఉన్నారని తెలిపారు. ఒక్క రుణమాఫీ మాత్రమే కాదు ఎన్నో హామీలు ఇచ్చారన్న ఆయన అవన్నీ ఏమయ్యాయని అడిగారు.

'ఎత్తు కుర్చీపై కూర్చోవడం కాదు. తలెత్తి రైతుల కష్టాలు చూడాలి. కొంగర్​కలాన్​లో ఫాక్స్​కాన్​కు వెళ్లి గోడలకేసిన్ సున్నాలు చూస్తావా. ఇక్కడ జరుగుతున్న రైతు ధర్నా ప్రపంచానికి తెలియయొద్దనే ఫాక్స్​కాన్ సందర్శన కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అన్నవస్త్రం కోసం పోతే ఉన్నవస్త్రం పోయినట్టు అటు ఇటు కాకుండా తయారయింది ప్రస్తుత ప్రభుత్వంలో రైతుల పరిస్థితి. పింఛన్లు, రైతు బంధు, బతుకమ్మ చీరలు ఏమయ్యాయి.' అని కేటీఆర్ అన్నారు.

నాపై అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి క్షమాపణలు చెప్పేంతవరకు ఆగేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి మీద కూడా త్వరలోనే పరువు నష్టం దావా వేస్తానన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోమని మోదీకే చెప్పాము ఈ ముఖ్యమంత్రి ఎంత అని అన్నారు. మా ఇళ్లు, నిర్మాణాలు కూలగొడితే నీ కళ్లు చల్లబడతాయి అనుకుంటే కూలగొట్టు కానీ పేదల ఇళ్లు కూల్చోద్దని చెప్పారు. రెడ్డి కుంటలో ఉన్న సీఎం ఇల్లు కూడా చెరువు భాగంలోనే ఉంది మొదటగా దానిని కూలగొట్టాలన్నారు. రేవంత్ అన్న తిరుపతిరెడ్డి ఇల్లు కూడా చెరువు భూమిలోనే ఉంది దాన్ని కూడా కూలకొట్టాలని డిమాండ్ చేశారు.

''గంగ'కు రూ.17 కోట్లు, మూసీకి రూ.2700 కోట్లా? - ఇది బ్యూటిఫికేషన్​ కాదు, లూటిఫికేషన్'​ - KTR SLAMS THE TG GOVT

బుల్డోజర్ రాజకీయాలపై ప్రజల గళం - రాహుల్ గాంధీకి వినిపించడం లేదా? : కేటీఆర్ - KTR ON MUSI DEMOLITIONS

Last Updated : Oct 5, 2024, 4:05 PM IST

ABOUT THE AUTHOR

...view details