ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

యువతిపై మూడేళ్లుగా అఘాయిత్యం - వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్​ అరెస్ట్​ - YSRCP MLA SUDHAKAR ARREST - YSRCP MLA SUDHAKAR ARREST

YSRCP Ex MLA Sudhakar Arrest: యువతిపై కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ వైకాపా ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కు కర్నూలు ఎక్సైజ్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తన తల్లిదండ్రులతో కలిసి డాక్టర్ సుధాకర్ ఇంట్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా తనను బెదిరించి శారీరకంగా అనుభవించారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రెండో పట్టణ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఎక్సైజ్ కోర్టు ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితుడిని కర్నూలు జిల్లా జైలుకు తరలించారు.

YSRCP Ex MLA Sudhakar Arrest
YSRCP Ex MLA Sudhakar Arrest (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 5, 2024, 7:26 AM IST

YSRCP Ex MLA Sudhakar Arrest:కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత డాక్టర్ జరదొడ్డి సుధాకర్ వికృత చేష్టలు గురువారం వెలుగులోకి వచ్చాయి. ఆయన ఓ యువతిపై గత మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. కొద్దిరోజుల కిందటి వరకు ఆయన ఎమ్మె ల్యేగా ఉండడంతో బాధితురాలు మౌనంగా భరిస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ధైర్యంగా ముందుకొచ్చి కర్నూలు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు.

తన తల్లిదండ్రులు సుధాకర్ ఇంట్లో పని చేస్తున్నారని, గత నాలుగేళ్లలో వారు పనికి వెళ్లనప్పుడల్లా తాను వెళ్లేదాన్ని అని, ఆ సమయంలో సుధాకర్ లైంగికంగా వేధించేవారని బాధితురాలు పేర్కొంది. భార్య ఇంట్లో లేనప్పుడు సుధాకర్‌ తనను మానసికంగా, శారీరకంగా హింసించేవారని, అశ్లీల చిత్రాలు చూపించేవారని వాపోయింది. సుధాకర్‌ నిజ స్వరూపం బయటపెట్టాలన్న ఉద్దేశంతో ఓరోజు సెల్​ఫోన్​లో ఆ వేధింపులను రహస్యంగా రికార్డు చేసినట్లు బాధితురాలు తెలిపింది. ఎమ్మెల్యే కావడంతో అప్పట్లో ధైర్యం చేసి ఎవరికీ చెప్పలేకపోయానని, గతేడాది నవంబరు నెలాఖరు వరకు దాదాపు మూడేళ్లుగా లైంగికంగా వేధించారని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదుతో రెండో పట్టణ పోలీసులు నిందితుడిపై వివిధ సెక్షన్లతోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని తొలుత ఓర్వకల్లు పోలీస్ స్టేషన్​కు, తర్వాత కర్నూలు డీఎస్సీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు. బాధితురాలిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి, వైద్య పరీక్షలు చేయించారు. నిందితుణ్ని గురువారం రాత్రి ప్రొహిబిషన్, ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఎం. సరోజనమ్మ సుధాకర్‌కు 14 రోజుల రిమాండు విధించారు. దీంతో సుధాకర్‌ను జిల్లా కారాగారానికి తరలించారు.

నెల్లూరు జైలుకు పిన్నెల్లి - పోలీసు బందోబస్తు మధ్య తరలించిన అధికారులు - Pinnelli Ramakrishna Reddy in Jail

డాక్టర్‌ సుధాకర్ సదరు యువతితో అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు సార్వత్రిక ఎన్నికల రోజు సాయంత్రమే వెలుగులోకి వచ్చాయి. అందులో యువతి ఎవరన్నది తెలియకపోవడం, ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ముందుకు రాకపోవడంతో ఆ వ్యవహారం మరుగునపడింది. అప్పట్లో ఎమ్మెల్యేగా తనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని బాధితురాలిని, ఆమె తల్లిదండ్రులను భయపెట్టి విషయం బయటకు రాకుండా కొందరు పెద్దలతో రాజీ చేయించినట్లు తెలుస్తోంది.

మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఆరెస్టు విషయంలో పోలీసు అధికారుల ప్రవర్తన వైకాపాపై వారి విధేయత ఏ మాత్రం తగ్గలేదని చాటింది. బాధితురాలి పిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసిన కర్నూలు రెండో పట్టణ పోలీసులు సుధాకర్‌ని ఇంటి కెళ్లి అరెస్టు చేశారు. ఎక్కడా మీడియా కంటపడకుండా రహస్యంగా ఓర్వకల్లు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. స్టేషన్లోకి ఎవర్నీ రానీయలేదు. తర్వాత కర్నూలు డీఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చాక కూడా ప్రహరీ గేటు మూసేసి, లోపలికి ఎవరూ రాకుండా చూశారు. చీకటిపడే వరకు కోర్టుకు తీసుకురాకుండా న్యాయమూర్తి ఇంటికి వెళ్లేవరకు జాప్యం చేశారు. న్యాయమూర్తి రిమాండ్ విధించాక కూడా ఎవరికంటా పడకుండా జిల్లా కారాగారానికి సుధాకర్‌ని తరలించారు.

విశాఖలో బాలికపై అత్యాచారం- నిందితుడు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details