ETV Bharat / state

'గిన్నిస్​ బుక్'​లో ఆంధ్రా ఫ్యామిలీ - చైనాలో ఉంటూ వరుస రికార్డులు - GUINNESS WORLD RECORDS FAMILY

ఫ్యామిలీలో అందరికీ ‘గిన్నిస్‌ వరల్ట్ రికార్ట్స్​’లో స్థానం - చైనాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ వాసులు ఘనత

Guinness_world_Records_Family
Guinness world Records Family (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2024, 10:16 AM IST

Guinness world Records Family: సాధారణంగా ఒక్కరు గిన్నిస్‌ బుక్‌ వరల్డ్ రికార్డు సాధించారంటేనే ఎంతో అరుదైన విషయంగా చెప్పుకొంటాం. ఎందుకంటే ఎంచుకున్న విషయంపై కఠోర సాధనతో పాటు కుటుంబ సహకారం ఉంటేనే ఆ రికార్డుని సాధించగలం. అలాంటిది ఒకే కుటుంబానికి చెందిన నలుగురూ ‘గిన్నిస్‌ వరల్ట్ రికార్ట్స్​’లో స్థానం సంపాదించారు. ఆంధ్రప్రదేశ్​లోని అనకాపల్లి జిల్లాకి చెందిన ఈ కుటుంబం గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

నలుగురికీ స్ఫూర్తినిచ్చే దీక్ష, పట్టుదల ఉన్న ఆంధ్రప్రదేశ్​కి చెందిన ఆ కుటుంబం ప్రస్తుతం చైనాలో స్థిరపడ్డారు. జిల్లా కేంద్రమైన అనకాపల్లికి చెందిన కొణతాల విజయ్‌కి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. విజన్ కొంతకాలం కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. అదే విధంగా యోగాలోనూ ప్రావీణ్యం సంపాదించారు. విజయ్‌ భార్య జ్యోతి సైతం యోగాలో సాధన చేశారు.

2014లో చైనాకు వెళ్లిన ఈ ఆంధ్రా కుటుంబం, చైనాలో యోగా, డ్యాన్స్‌ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అనంతరం యోగాలో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. తొలుత విజయ్ గిన్నిస్ రికార్డు సాధించారు. 2012లో విజయ్‌ అష్టవక్రాసనం 22 నిమిషాలు, బాకాసనం 3 నిమిషాలు, మయూరాసనం 2 నిమిషాలపాటు వేసి గిన్నిస్‌ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు.

అనంతరం ఆ స్ఫూర్తితో విజయ్ భార్య జ్యోతి నిండు గర్భిణిగా ఉన్నప్పుడు అత్యధిక యోగాసనాలు వేయడం, కూర్మాసనాన్ని ఏకధాటిగా 10 నిమిషాలు పాటు వేసి గిన్నిస్‌ రికార్డులో తన పేరు రిజిస్టర్ చేసుకున్నారు. తల్లిదండ్రుల నుంచి స్ఫూర్తి పొందిన వారి పిల్లలు సైతం వారి బాటలోనే నడిచారు. విజయ్ - జ్యోతిల 14 ఏళ్ల కుమార్తె జస్మిత ఒంటికాలితో నిమిషానికి 160 సార్లు స్కిప్పింగ్‌ చేసి 2024 జూన్‌లో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్ట్ రికార్డ్స్​లో చోటు సంపాదించారు. తాజాగా వారి ఐదేళ్ల కుమారుడు శంకర్‌ సైతం గిన్నిస్ రికార్టు సాధించాడు. ట్రాంపొలిన్‌పై ఎగురుతూ నిమిషానికి 129 సార్లు స్కిప్పింగ్‌ చేసి ఈ సంవత్సరం నవంబరులో గిన్నిస్​ బుక్​లో చోటు సంపాదించారు.

నాణెంపై ‘భారత్‌’కు బదులుగా ‘మారత్‌’ - 30 ఏళ్ల కృషితో 3 గిన్నిస్‌ రికార్డులు

ఘనతల్లోనే కాదు సేవల్లోనూ మెగాస్టారే​!- గిన్నీస్​తో పాటు చిరు పేరిట ఎన్ని రికార్డులు ఉన్నాయంటే? - Chiranjeevi Guinness

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.