Kishan Reddy Speech at Musheerabad BJP Meeting: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. ఓటేసిన తర్వాత ఫొటో తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదులు వచ్చి దేశ ప్రజలను చంపేవారని, ప్రధాని మోదీ హయాంలో ఉగ్రవాదులను మట్టుబెట్టామని అన్నారు. హైదరాబాద్లోని ముషీరాబాద్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Kishan Reddy Comments :దేశంలో మత కలహాలు కావాలా? శాంతి కావాలా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో జమ్ముకశ్మీర్లోనే 42 వేల మంది పౌరులను ఉగ్రవాదులు చంపారని తెలిపారు. హస్తం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పాకిస్థాన్ ఏమనుకుంటే అది భారత్లో జరిగేదని ఆరోపించారు. మోదీ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టామని పేర్కొన్నారు. తమ పార్టీ పాలనలో పాకిస్థాన్ తోక కత్తిరించామని చెప్పారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్ కోసం మోదీ మళ్లీ అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు.
సికింద్రాబాద్ ఎంపీగా మా ఆయననే గెలిపించండి - కిషన్ రెడ్డి సతీమణి ప్రచారం - Kishan Reddy Wife Campaign
Uttarakhand CM Election Campaign in Telangana: దేశంలో మళ్లీ మోదీ సర్కార్ రావాలని అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి అన్నారు. కారు షెడ్డుకు వెళ్లిందని, ఇక అది రిపేర్ అయ్యే స్థితిలో లేదని వ్యాఖ్యానించారు. తమ పార్టీ ప్రతి వ్యక్తికి ఉత్తరాఖండ్లో యూసీసీ యాక్ట్ తీసుకొచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో మోసం చేసిందని ఆరోపించారు.