Kishan Reddy and Bandi Sanjay as a Central Ministers: దేశంలో బీజేపీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన తరవాత మొదటిసారి మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న కిషన్ రెడ్డికి బొగ్గు గనులశాఖను కేటాయించగా, బండి సంజయ్‌కు హోంశాఖ సహాయ మంత్రిగా నియమించారు. మరోవైపు ఏపీ నుంచి కేంద్రమంత్రులుగా నియమించిన వారిలో కింజరాపు రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్లు (సహాయమంత్రి), భూపతిరాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు (సహాయ మంత్రి) శాఖలను కేటాయించారు.
Cabinet Minister Kishan Reddy about coal production : కేంద్రంలోని ఇతర మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. విద్యుత్ కోతల్లేని దేశాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారన్న కిషన్‌రెడ్డి, బొగ్గు, గనుల శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తానని ధీమా వ్యక్తం చేశారు. బొగ్గు, గనులు దేశానికి ఆదాయం తీసుకొచ్చే శాఖలు అభివర్ణించిన కేంద్ర మంత్రి, తెలుగు వారికి మంచి శాఖలు కేటాయించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తికి, వంద రోజుల కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.
Union Minister Bandi Sanjay on Telangana Development : రాజకీయాలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యంగా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సహా అన్ని పార్టీల నేతలు అదే ఒరవడి కొనసాగించేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అందరూ కలిసి ముందుకెళ్తే అభివృద్ధి జరుగుతుందని, తెలంగాణ సర్కార్‌కు తన సంపూర్ణ సహకారం ఉంటుందని సంజయ్ వెల్లడించారు. ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలకు, కేంద్రమంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.