KCR Public Meeting in Nalgonda: కృష్ణా నదీ పరివాహక ప్రాంత నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొమ్మిదిన్నరేళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఫలితాలు, మార్పులను ఆయన సమావేశంలో ప్రస్తావించారు. వ్యవసాయ రంగానికి పూర్తి ప్రాధాన్యత ఇచ్చామని సాగు నీరు, విద్యుత్‌తో పాటు రైతు సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకాన్ని తెచ్చామని వివరించారు.
నన్ను, నా పార్టీని టచ్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు : కేసీఆర్
KCRMeeting on Krishna River Water : నదీ జలాల విషయంలో రాజీలేని పోరాటం చేశామని, కేంద్రానికి ఎక్కడా తలొగ్గలేదని కేసీఆర్(KCR Comments) తెలిపారు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన ఉందో, లేదోనన్న ఆయన, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించేందుకు అంగీకరించడం ద్వారా రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆక్షేపించారు. విషయంపై దృష్టి సారించకుండా దూషిస్తే ఏమొస్తుందని ప్రశ్నించారు. పాలన చేతకాక తనపై కారు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి వాళ్లను ఎంతో మందిని చూశానన్నారు.
BRS Nalgonda BRS Public Meeting : నల్గొండ సభ అడ్డుకుంటాననేందుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎవరని కేసీఆర్ప్రశ్నించారు. సభను అడ్డుకునేది ఎవరని, ఎట్ల పెట్టుకోనివ్వరో చూద్దామని అన్నారు. నల్గొండ సభ కోసం వెంటనే దరఖాస్తు చేయాలని నేతలను ఆదేశించారు. అనుమతి ఇవ్వకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. ఉమ్మడి నల్గొండ(BRS Nalgonda Public Meeting) జిల్లా నుంచి భారీ ఎత్తున జనాన్ని సమీకరించాలని నేతలకు స్పష్టం చేశారు. 12 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. మిగిలిన నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని ప్రతి మండలం నుంచి సభకు ప్రాతినిథ్యం ఉండాలని సూచించారు. వీలైనంత వరకు సభకు యువత వచ్చేలా చూడాలని, వారి ద్వారా గ్రామాల్లో చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. నల్గొండ సభ కంటే ముందే నియోజకవర్గ, మండల స్థాయిలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.