నన్ను, నా పార్టీని టచ్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు : కేసీఆర్ KCR on Krishna River Water: రాష్ట్ర ప్రయోజనాలే బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమని పార్టీ అధినేత కేసీఆర్ తెలిపారు. మరో ప్రజాఉద్యమంతో తెలంగాణ హక్కులు కాపాడతామని అన్నారు. ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఎండగడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం రైతుల సాగునీటి హక్కులకు గొడ్డలిపెట్టులా ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్(BRS)కు పోరాటం కొత్త కాదని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలే పార్టీకి ముఖ్యమని స్పష్టం చేశారు. కేఆర్‌ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. నల్గొండలో ఈనెల 13న బీఆర్ఎస్ బహిరంగ సభ ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్(Telangana Bhavan)లో కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.
గులాబీ బాస్ ఈజ్ బ్యాక్ - మూణ్నెళ్ల తర్వాత తెలంగాణ భవన్‌కు కేసీఆర్
KCR Meeting with BRS Leaders : రాష్ట్ర హక్కులు కాపాడుకునేందుకు ఎంతకైనా పోరాడతామని మాజీ సీఎం కేసీఆర్(KCR) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి రాష్ట్ర ప్రజల జుట్టు అప్పగించిందని ఆరోపించారు. హస్తం పార్టీ వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. కేఆర్‌ఎంబీ(KRMB) పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. డ్యామ్‌కు సున్నం వేయాలన్నా కేఆర్ఎంబీ అనుమతి కోరాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించకూడదనే తమ పోరాటం చేస్తామని తెలిపారు. నల్గొండ భారీ బహిరంగ సభతో ఉద్యమం ఉద్ధృతం చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నేడు తెలంగాణ భవన్‌కు కేసీఆర్ - ఘనస్వాగతం పలికేందుకు శ్రేణుల ఏర్పాట్లు
"కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడునేందుకు ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకైనా పోరాడుతాం. కాంగ్రెస్ సర్కార్ కేఆర్ఎంబీకి సాగర్, శ్రీశైలం సహా కృష్ణా ప్రాజెక్టులను అప్పజెప్పి కేంద్రం చేతికి మన జుట్టు అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ, వ్యవసాయ, రైతాంగ వ్యతిరేఖ నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ఎండగడుతాం." - కేసీఆర్, బీఆర్ఎస్ అధ్యక్షుడు
KCR Latest Movement in Telangana: నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించామని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలదని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో సాగునీరు, తాగునీటి హక్కుల కోసం పోరాడడమే కాకుండా 'మా నీళ్లు మాకే' అనే ప్రజా నినాదంతో ముందుకు సాగిన తీరును గుర్తు చేశారు. కేఆర్ఎంబీ పేరుతో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణ హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగడలను బీఆర్ఎస్ ప్రభుత్వం తిప్పికొట్టిందని తెలిపారు.
KCR Fire on Congress: కాంగ్రెస్ సర్కార్‌కి తెలివి లేదని కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు కనీసం అవగాహన చేసుకోకుండా వ్యక్తిగతంగా తనను, పార్టీను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని ఆక్షేపించారు. మొత్తం విషయం అర్థం చేసుకోకుండా వాస్తవం తెలుసుకోకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తనను, తనపార్టీని టచ్ చేయడం ఎవరికి సాధ్యం కాదని, ఇంతకుమించిన హేమాహేమీలనే ఎదుర్కొన్న చరిత్ర ఉందని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని పదేళ్లు పదిలంగా కాపాడుకున్నామని ఇప్పుడు పరాయివారి పాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడూ వెనక్కు పోడని ఉడుత బెదిరింపులకు భయపడబోనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వెయ్యి శాతం మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజలన్నీ గమనిస్తున్నారు - కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, ఉండదా అనేది ఆ పార్టీ నేతల చేతుల్లోనే ఉంది : కేసీఆర్
ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం - పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు