తెలంగాణ

telangana

ETV Bharat / politics

గులాబీ బాస్ ఈజ్ బ్యాక్ - మూణ్నెళ్ల తర్వాత తెలంగాణ భవన్​కు కేసీఆర్

KCR at Telangana Bhavan Today 2024 : బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్ మూడు నెలల తరవాత ఇవాళ తెలంగాణ భవన్​కు వెళ్లారు. కృష్ణా జలాల అంశానికి సంబంధించిన కార్యాచరణపై బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ పార్టీ కార్యాలయానికి రావడంతో అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చిగులాబీ బాస్​కు ఘనస్వాగతం పలికారు.

BRS Metting at Telangana Bhavan
KCR at Telangana Bhavan

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2024, 1:25 PM IST

Updated : Feb 6, 2024, 4:33 PM IST

KCR at Telangana Bhavan Today 2024: మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్(KCR) 3 నెలల విరామం తర్వాత బీఆర్ఎస్ పార్టీ​ కార్యాలయమైన తెలంగాణ భవన్​కు వెళ్లారు. పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకుని కేసీఆర్​కు స్వాగతం పలికారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్​కు ఆయన రావడంతో కేసీఆర్​ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.

ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం - పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు

BRS Meeting at Telangana Bhavan: కృష్ణా జలాల అంశానికి సంబంధించిన కార్యాచరణపై కేసీఆర్బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నేతలు పాల్గొన్నారు. కృష్ణా జలాల అంశంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్​రావు, ఇతర బీఆర్ఎస్​ నాయకులు​ కూడా తెలంగాణ భవన్​కు చేరుకున్నారు.

నేడు తెలంగాణ భవన్‌కు కేసీఆర్ - ఘనస్వాగతం పలికేందుకు శ్రేణుల ఏర్పాట్లు

Harish Rao Reaction on KCR Telangana Bhavan : కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ ఇకపై చూస్తారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీకి కూడా వస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలపై కచ్చితంగా నిలదీస్తామని తెలిపారు. మరోవైపు మాజీ మంత్రి మల్లారెడ్డి తెలంగాణ భవన్​కు(Telangana Bhavan) కేసీఆర్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సీఎం రేవంత్(CM Revanth Reddy)​ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిట్ల కోసమా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మాట్లాడిన భాష మంచిది కాదని మండిపడ్డారు. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి తిరగబడి, నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.

"డిసెంబర్​ 9న రుణమాఫీ, ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్​- 1 నోటిఫికేషన్​ ఇస్తామని కాంగ్రెస్​ ప్రభుత్వం ఎన్నికల ముందు వారే తేదీలను ఫిక్స్​ చేసింది. కాంగ్రెస్​ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. వారు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోయారు. దీంతో ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఆటో కార్మికులను రోడ్డు మీదకు తెచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే 20 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. విద్యుత్​ కోతలు పెరిగాయి. ఇదే కాంగ్రెస్​ పార్టీ తెచ్చిన మార్పులు. కేసీఆర్ అసెంబ్లీకి కూడా వస్తారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన పోరాటం చూస్తారు." - హరీశ్​ రావు, మాజీ మంత్రి

గులాబీ బాస్ ఈజ్ బ్యాక్ - మూణ్నెళ్ల తర్వాత తెలంగాణ భవన్​కు కేసీఆర్

ప్రజలన్నీ గమనిస్తున్నారు - కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, ఉండదా అనేది ఆ పార్టీ నేతల చేతుల్లోనే ఉంది : కేసీఆర్

Last Updated : Feb 6, 2024, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details