Sharmila meet Karnataka Deputy CM DK :వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో షర్మిల భేటీ అయ్యారు. ఢిల్లీలోని సోనియా నివాసంలో వారిని కలిసి రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికలు, తదుపరి కార్యాచరణపై చర్చలు జరిపారు. తమ మధ్య నిర్మాణాత్మకమైన చర్చ జరిగిందని భేటీ అనంతరం షర్మిల ఎక్స్‌లో ట్వీట్ చేశారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పునః వైభవం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో కాంగ్రెస్ బలీయమైన శక్తిగా అవతరించడంలో మరిన్ని అడుగులు పడనున్నాయని షర్మిల పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా బెంగళూరులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్ తో పీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల సమావేశమయ్యారు. ఈ నెల 8న తన తండ్రి YS రాజశేఖర్ రెడ్డి జయంతికి రావాలని శివకుమార్ ను ఆమె ఆహ్వానించారు. YSR జయంతి కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను షర్మిల ఆహ్వానించారు.
నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : వైఎస్ షర్మిల - YS Sharmila Fires on Central Govt