Janasena Chief Pawan Kalyan Delhi Tour :జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు దిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah)తో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అమిత్‌షాను కలిశారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్లిన పవన్ కల్యాణ్ ఇవాళ అక్కడి నుంచి దిల్లీకి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Janasena Pawan Kalyan Meeting in Mangalagiri :రాబోయే తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం ఇప్పుడున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఇప్పుడున్న పథకాలకు అదనంగా డబ్బులు జోడించి ఇస్తామే తప్ప వాటిని రద్దు చేసే ఆలోచనే లేదన్నారు. ప్రమాదంలో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ చెక్కులు అందజేశారు. 20 మంది కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించారు.
పేదలకు జగన్ ఏనాడు తన సొంత జేబులోంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని పవన్ విమర్శించారు. డ్వాక్రా మహిళల సమస్యలు పరిష్కారానికి అధ్యయనం చేస్తున్నామన్నారు. డ్వాక్రా మహిళలకు అండగా ఉంటామని పవన్ చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న 5 లక్షల రూపాయలు కష్టంలో ఉన్నప్పుడు తాము ఉన్నాము అనే చిరు ప్రయత్నం మాత్రమే అని పేర్కొన్నారు. ఈ సహాయం ఇక్కడితో ఆగదని స్పష్టం చేశారు.