BRS leader Jagdish Reddy comments :రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రైతుబంధు పథకాన్నే కొనసాగిస్తోందని, కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు నిధులను ఎప్పుడైనా జూన్‌లోనే వేసిందని గుర్తు చేశారు. రుణమాఫీ చేపట్టినప్పటికీ రైతుబంధు నిధులు కూడా వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు కాలయాపన చేసేందుకే మంత్రివర్గ ఉపసంఘం వేశారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. యాసంగి రైతుబంధు వేసిన ఖాతాల్లో వెంటనే వానాకాలం రైతు భరోసా వేయాలన్నారు.
జూన్ 30లోపు రైతు బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది మోసపూరిత ప్రభుత్వమని దుయ్యబట్టారు. విద్యుత్ బిల్లుల మాఫీ కూడా అమలు కావడం లేదని ఆరోపించారు. ఆగస్టు 15లోపు ఏకకాలంలో రూ.2 లక్షలలోపు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మిగతా హామీల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ప్రస్తావించట్లేదని పేర్కొన్నారు.
అక్రమ మైనింగ్‌తో రూ.కోట్లలో అక్రమార్జన - బినామీల విచారణకు సర్వం సిద్ధం! - ED Raids MLA Mahipal Reddy house
మహిళలు, పురుషులపై విచక్షణా రహితంగా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొద్దుగాల వీధి కుక్కలు మహిళలపై దాడి చేస్తున్నాయని, పొద్దుగూకితే చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇసుక మాఫియా యథేచ్ఛగా రెచ్చితుందన్నారు. విద్యుత్ విచారణ కమిషన్ జస్టిస్ ఎల్.కమిషన్ నుంచి ఈరోజు తనకు కూడా ఉత్తరం వచ్చిందని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. లేఖ అందిన వారం రోజుల్లో సమాధానం చెప్పండి అని కమిషన్ నుంచి లేఖ వచ్చిందన్నారు. అన్ని విషయాలపై తనకున్న సమాచారం కమిషన్‌కు అందజేస్తానని తెలిపారు.
ఊహాజనిత అనుమానాలు తప్పు అని కమిషన్‌కు తెలియజేస్తానని జగదీశ్ రెడ్డి తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం వల్ల నష్టం జరిగిందని ఎవరైతే సమాచారం ఇచ్చారో అంతటితో పూర్తి కాలేదని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి నుంచి, ట్రాన్స్ కో, జెన్కో, బెల్ అధికారులను అందరినీ విచారించాలని కోరారు. సబ్ క్రిటికల్‌కు అనుమతులు, పర్యావరణ అనుమతులు ఇచ్చిన కేంద్ర అధికారులు, మంత్రులు ఇలా అందరినీ విచారణకు పిలవాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుకూలంగా విచారణ చేసినట్లు కనిపిస్తుందని పేర్కొన్నారు. రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లిందని రాసిన పత్రికల రిపోర్టర్లను, ఆ సమాచారం ఎలా వచ్చిందని పిలిచి విచారించాలని కమిషన్‌ను కోరతానని జగదీశ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ శాఖకు విద్యుత్ బిల్లులు కూడా చెల్లించటం లేదని ఆరోపించారు.
మంత్రిపై నిరాధార ఆరోపణలు - ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు